Dasara Nani : భయ్యా... ఇంకా ఎన్నాళ్లు ఈ 'దసరా' వేషం

యంగ్ హీరో నాని లుక్ విషయం లో గత కొన్ని రోజులుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈయన దసరా సినిమా కోసం జుట్టు గడ్డం బాగా పెంచేశాడు.

 Social Media Trolls On Young Hero Nani , Dasara , Hit 2 Movie, Nani,tollywood, T-TeluguStop.com

సాధారణం గా నాని సినిమా లు నాలుగు నుండి ఐదు నెలల్లో పూర్తవుతాయి.కొన్ని సినిమాలు అంతకు ముందే పూర్తి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలాంటిది దసరా సినిమా కోసం నాని చాలా ఎక్కువ రోజులు డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.చాలా నెలలుగా ఆయన గడ్డం మరియు పెరిగిన జుట్టుతోనే కనిపిస్తున్నాడు.

ఇటీవల ఆయన నిర్మించిన హిట్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో పూర్తి గా జుట్టు గడ్డం తో కనిపించాడు.నాని ని న్యాచురల్ లుక్ లో నార్మల్ గెటప్ లో చూస్తేనే అభిమానులు ఆదరిస్తారు.

ఇలాంటి మాస్ లుక్ లో ఆయన్ని చూడాలనుకోవడం లేదంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

Telugu Dasara, Nani, Telugu, Tollywood-Movie

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న దసరా సినిమా కోసం నాని ఈ కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడు.అది బానే ఉంది.కానీ మరి రియల్ లైఫ్ లో కూడా మరి ఇంత మాస్ గా ఉంటే చూడలేక పోతున్నాం బాసు అంటూ చాలా మంది నాని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అతి త్వరలోనే దసరా సినిమా యొక్క చివరి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

దసరా సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే నాని తన గడ్డం మరియు జుట్టు ను తగ్గించుకునే అవకాశం ఉంది.ఆ రోజు కోసం తాము అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube