అంత పొగరు ఎందుకు.. మోహన్‌ బాబు తీరుపై సూపర్‌ స్టార్‌ అభిమానులు విమర్శలు

టాలీవుడ్‌ వర్గాల వారితో పాటు ప్రేక్షకులకు తెలిసిన విషయం ఏంటీ అంటే మోహన్ బాబు నిర్మొహమాటంగా మాట్లాడుతాడు.ఆయన ఏం చేసినా కూడా ఇతరులకు భయపడడు.

 Social Media Trolls On Mohan Babu About Super Star Rajnikanth, Manchu Vishnu, Mo-TeluguStop.com

ఆయన చేసే ప్రతి వ్యాఖ్యలు కూడా ఇతరులను హర్ట్‌ చేసినా కూడా పట్టించుకోడు.వేదిక ఏదైనా కూడా మోహన్ బాబు స్పందించే తీరు మాత్రం ఒకే విధంగా ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి.

అలాంటి మోహన్‌ బాబు ఇటీవల రజినీకాంత్‌ తో తీసుకున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్‌ లో నెల రోజులు గడిపిన రజినీకాంత్‌ ఆ సమయంలోనే మోహన్‌ బాబు ఇంట రెండు రోజులు ఉన్నాడు.

ఆ సమయంలో ఇద్దరి మద్య చాలా ముచ్చట్లు వచ్చాయట.అదే సమయంలో రజినీకాంత్‌ తో ఒక ఫొటో షూట్‌ ను కూడా మోహన్ బాబు తీసుకున్నాడు.

విష్ణు కూడా ఆ ఫొటో షూట్‌ లో ఉన్నాడు.ఆ ఫొటోలు చాలా వైరల్‌ అయ్యాయి.

అయితే కొందరు మాత్రం మోహన్ బాబు తీరును తప్పుబడుతున్నారు.

మోహన్‌ బాబుకు రజినీకాంత్‌ ఆప్త మిత్రుడు.

చాలా కాలంగా ఇద్దరి మద్య స్నేహం ఉంది.ఇద్దరు కూడా ఒరేయ్ అనుకునే స్నేహితులు.

అలాంటి స్నేహితులు ఫొటోలు దిగే సమయంలో ఒకరిపై ఒకరు చేయి వేసుకోవడం కామన్‌.కాని రజినీకాంత్‌ పై మోహన్‌ బాబు చేయి ఇలా వేయడంను ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు.

మోహన్‌ బాబు పై కూడా రజినీకాంత్‌ చేయి వేశాడు.కాని అది ఇంతగా చర్చనీయాంశం కాలేదు.

చాలా పద్దతిగా అన్నట్లుగా మోహన్‌ బాబును రజినీకాంత్‌ పట్టుకున్నాడు.కాని మోహన్ బాబు మాత్రం ఇలా భుజం మీద స్టైల్‌ వేసి నిల్చున్నాడు.

దాంతో వందల కామెంట్స్ రాగా అందులో చాలా వరకు మోహన్‌ బాబు అలా నిలవడంపైనే విమర్శలు చేస్తున్నారు.

Telugu Bad, Manchu Vishnu, Mohan Babu, Netizens, Rajinikanth, Rajnimohan, Tollyw

రజినీకాంత్ గారు మీ నాన్నకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయ్యి ఉంటాడు.కాని ఆయన ఒక సూపర్‌ స్టార్‌.ఆ విషయాన్ని గుర్తించుకోవాలి.

ఆ విషయం గుర్తించి మీరు ఇలాంటి ఫొటోలు షేర్‌ చేయకుండా ఉండాలంటూ మంచు విష్ణుకు ఒక వ్యక్తి సూచించాడు.మరి కొందరు మోహన్‌ బాబు పై బ్యాడ్‌ కామెంట్స్ కూడా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube