అప్పుడు స్పందించి ఇప్పుడెందుకు స్పందించవు మహేష్‌?  

Social Media Troll On Mahesh Babu - Telugu Amazon Forest, Mahesh Babu, Mahesh Respond On Tamila Cinimas, Save Nallamalla Forest, Not Respond On Nalla Malla Forest

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలపై అప్పుడప్పుడు ట్రోల్స్‌ వస్తూనే ఉంటాయి.ఆమద్య మహేష్‌ బాబు తమిళ సినిమాలపై స్పందిస్తూ తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.

Social Media Troll On Mahesh Babu

ఆ సమయంలో పెద్దగా స్పందించని మహేష్‌ బాబు తాజాగా మరోసారి ట్రోల్స్‌కు గురవుతున్నాడు.ఆమద్య అమెజాన్‌ అడవులు తగులబడి పోతున్న సమయంలో తీవ్ర మనస్థాపంకు గురవుతున్నట్లుగా మహేష్‌బాబు ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

అమెజాన్‌ అడవుల గొప్పతనం చెబుతూ ఒక ట్వీట్‌ చేయడం జరిగింది.

అప్పుడు స్పందించి ఇప్పుడెందుకు స్పందించవు మహేష్‌-Movie-Telugu Tollywood Photo Image

 ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు మరియు టాలీవుడ్‌ సెలబ్రెటీలు అంతా కూడా సేవ్‌ నల్లమల అంటూ ఒక క్యాంపెయిన్‌ ప్రారంభించారు.యురేనియం తవ్వకాల కోసం అంటూ ప్రభుత్వాలు నల్లమల అడవులను నాశనం చేస్తున్నారు అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు.లక్షలాది మంది ఇప్పటికే సోషల్‌ మీడియాలో నల్లమల విషయమై స్పందిస్తూ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఇలాంటి సమయంలో మహేష్‌బాబు మాత్రం మౌనంగా ఉన్నాడు.

 అమెజాన్‌ అడవులు కాలిపోతున్న సమయంలో మంచి మనసుతో స్పందించి గొప్ప వాడు అనిపించుకున్న మహేష్‌ బాబు అందరితో పాటు నల్లమల అడవుల సంరక్షణకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, అలా ఎందుకు మహేష్‌ బాబు రావడం లేదంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అంటూ మహేష్‌బాబు ఏమైనా భయపడుతున్నాడా అని కూడా నెటిజన్స్‌ కొందరు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా మహేష్‌బాబు సేవ్‌ నల్లమల క్యాంపెయిన్‌లో భాగస్వామి కావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు