బాబోయ్‌ మహేష్‌ ఏంటీ మరీ ఇలా తయారు అయ్యాడు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లాక్‌ డౌన్‌ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు.గత కొన్ని రోజులుగా మహేష్‌బాబుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

 Mahesh Babu Latest Photo Wiral In Social Media Mahesh Babu, Social Media, Mahesh-TeluguStop.com

మహేష్‌బాబు పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఫొటోలు కూడా వస్తున్నాయి.గౌతమ్‌ మరియు మహేష్‌బాబులు కలిసి ఉన్న ఫొటో ఒకటి ఆమద్య నెట్టింట ప్రత్యక్ష్యం అయ్యింది.

ఆ ఫొటోలో ఉన్నది మహేష్‌బాబు గౌతం అని తెలుస్తుంది.కాని అందులో ఎవరు మహేష్‌బాబు ఎవరు గౌతమ్‌ అనేది మాత్రం తెలుసుకోవడానికి కనీసం ఒకటి రెండు నిమిషాలు పట్టింది.

తాజాగా మహేష్‌ బాబు మరో ఫొటో సోషల్‌ మీడియాలో వచ్చింది.అందులో మహేష్‌బాబు కుక్కను ముద్దు చేస్తున్నట్లుగా ఉంది.ఆ ఫొటోను చూసి చూడనట్లుగా చూస్తే అందులో ఉన్నది మహేష్‌బాబు కాదు గౌతమ్‌ అని అంతా అనుకునేట్లుగా ఉంది.మహేష్‌బాబు ఈ మద్య కాలంలో మరీ తక్కువ వయసు కుర్రాడిగా కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

అయిదు పదుల వయసుకు దగ్గరకు వస్తున్నా కూడా పాతికేళ్ల లోపు కుర్రాడి మాదిరిగానే మహేష్‌ కనిపించడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Telugu Gautham, Mahesh Babi Dog, Mahesh Babu, Maheshbabu-Movie

ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్‌ హిట్‌ దక్కించుకున్న మహేష్‌బాబు తదుపరి చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు.అందుకు సంబంధించిన వర్క్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది.లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తే షూటింగ్‌ ప్రారంభించాలని భావిస్తున్నారు.

అతి త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube