తమ శరీరం పట్ల అసంతృప్తి చెందటానికి అది కూడా ఓ కారణం

ఓ పదేళ్లు వెనక్కివెళితే, గ్లాస్ ఫిగర్ అంటే ఏంటో మనలో చాలామందికి తెలీదేమో.ముక్కు సైజ్ ఇంత ఉండాలని, చర్మం రంగు ఇలా ఉండాలని, గడ్డం ఇలా ఉండాల్సిందే అని, వక్షోజాలు అలా లేకపోతే కష్టమని పెద్దగా చదువుకోలేదేమో మనం.

 Social Media Is Making People Unhappy With Their Looks-TeluguStop.com

అప్పట్లో హీరోహీరోయిన్లు కూడా ఇవన్ని పట్టించుకునేవారు కాదు కదా! బొద్దుగా ఉండే హీరోయిన్లు ఎంతమంది రాలేదు, ఎంతమందిని ప్రేక్షకులు ఆదరించలేదు.వారి శరీరం బాగాలేదు, ఫిగర్ సరిగా లేదు అనే కామెంట్స్ విన్నామా అసలు.

మరి ఇప్పుడో ! విరాట్ కొహ్లిలాగా గడ్డం పెరగాల్సిందే.జీన్స్ లో ఉన్నా, లేకున్నా, అలాంటి గడ్డం రాకపోతే, నాలో లోపం ఉంది, నా ముఖం సరిగా లేదు, ఎప్పుడు క్లీన్ గా ఉండే ముఖాన్ని చూస్తే ఏం అనుకుంటారో అమ్మాయిలు అనే ఇబ్బందిపడే అబ్బాయిలు ఉన్నారు.

ఎమ్మా వాట్సన్ స్మయిల్ కావాల్సిందే, దీపికా లాగా ఫిట్ గా ఉండాల్సిందే, తమన్నా లాంటి నడుము ఉంటేనే సరి, వక్షోజాలు కనీసం పూనమ్ పాండేలా ఉండాలి, అప్పుడే శరీరం, అందం పద్ధతిగా ఉన్నట్లు అని అనుకునే అమ్మాయిలు లెక్కలేనంత మంది.

మరీ ఇంత చాదస్తంగా ఎందుకు తయారవుతోంది యువత ? మరీ ముఖ్యంగా అర్బన్ యూత్ అందరికి లుక్స్ పిచ్చి పట్టుకుంది.దీనికి కారణం సోషల్ మీడియా అంటున్నారు పరిశోధకులు.సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోజుల మీద రాసే ఆర్టికల్స్, కామెంట్స్ లో వారి అందానికి భజన చేసే ఫ్యాన్స్ వలనే యువత తమని వారితో పోల్చుకోని మధనపడుతున్నారట.

దీనికి పరిష్కార మార్గం లేదా అంటే చెప్పలేం.మ్యెచురిటి, సైన్స్ .ఇవి మెదడులో ఉంటే తప్ప వారి బాధను ఎవరు చల్లార్చలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube