వైరల్ వీడియో: గుడ్డు దశ నుండి ఎగిరేవరకు చిలుక ఎలా మారిందో చూడండి…!  

parrot, egg, flying, mother, died - Telugu Died, Egg, Flying, Mother, Parrot

కొన్ని వీడియోలు చూస్తుంటే అలాగే చూడాలని అనిపిస్తుంది.వీడియో అయిపోయిన కూడా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా కొన్ని వీడియోలు రూపుదిద్దుకుంటాయి.

 Social Media Forest Officer Twitter Parrot Egg Flying Mother

తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ గా కొనసాగుతున్న వీడియో కూడా ఈ కోవకు చెందినదే.ఇక ఆ వీడియో విషయానికి వస్తే… ఓ తల్లి చిలుక గుడ్డు పెట్టిన తర్వాత దురదృష్టవశాత్తు మరణించింది.

అయితే తల్లి చిలుక పెట్టిన గుడ్డు ను పక్కన పడేయకుండా ఓ వ్యక్తి ఆ గుడ్డును తీసుకొని అందులో ఉండే ప్రాణాన్ని బతికించాడు.

వైరల్ వీడియో: గుడ్డు దశ నుండి ఎగిరేవరకు చిలుక ఎలా మారిందో చూడండి…-General-Telugu-Telugu Tollywood Photo Image

సదరు వ్యక్తి ఆ గుడ్డును తీసుకున్న తర్వాత పడేయకుండా ఆ గుడ్డు పై ఉన్న తెల్లటి షెల్ ని చాలా జాగ్రత్తగా తొలగించి అందులోనుంచి చిట్టి చిలుకను బయటికి తీశాడు.

నిజానికి ఆ సమయంలో ఆ చిలుక ఒక మాంసం ముద్దలా ఉంది అంతే.అలా బయటికి తీసిన చిట్టి చిలకను జాగ్రత్తగా దానిని హ్యాండిల్ చేసి ప్రతిరోజు చిలుకకు ద్రవ పదార్థాన్ని అందించేవాడు.

అలా ఆ చిలుకకు కొన్ని రోజులు ఓ చిన్న బౌల్ లో ఉంచుతూ, ఆ చిట్టి చిలక కంటే చిన్నగా ఉండే స్పూన్ సహాయంతో చిన్న పిల్లలకు సిరప్ తగ్గించే విధంగా చిలక కూడా ఆహారాన్ని అందించాడు.

ఇలా గుడ్డు దశ నుండి చిలుక తాను అంతకు తానే ఎగిరే వరకు మొత్తం ప్రక్రియను టైం లాప్స్ విధానంలో వీడియోని చేశాడు.

అయితే ఈ వీడియోని భారతదేశ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వన్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేయడమే ఆలస్యం లేదు.

అది కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది.ఈ వీడియోకి ” చిలక తల్లి చనిపోయింది.

అందువల్ల అతను తన బిడ్డను పెంచాడు.ఇది మధురమైన క్షణం” అనే శీర్షికను జోడించాడు.

అయితే ఈ వీడియోలో చిన్న చిలుక నుండి ఆహారం అందించడంతో అది రెక్కలు వచ్చి ఎగిరే స్టేజ్ కు పెరిగింది.ఆ చిలుక రెక్కలు రావడంతో ఇంట్లోనే హాయిగా ఎగురుతుంది.

#Flying #Died #Egg #Parrot #Mother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Social Media Forest Officer Twitter Parrot Egg Flying Mother Related Telugu News,Photos/Pics,Images..