సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తున్నారా...? అయితే ఇవి తెలుసుకున్నాకనే ఆ పని చేయండి...!

భారతదేశం టెలికాం రంగంలోకి జియో ఎప్పుడైతే ప్రవేశం చేసిందో… ఇక అప్పటి నుంచి భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం, అలాగే అందులో డేటా విపరీతంగా వాడటం ఎంతగానో పెరిగిపోయింది.దీంతో సోషల్ మీడియాలో ఎవరు ఎటువంటి పోస్టులు చేసిన వాటిని నచ్చితే అది నిజమా… అబద్దమా… అని లేకుండా ఫార్వర్డ్ చేసేస్తుంటారు.

 Forwarding Social Media Posts But Do That As Soon As You Know These, Social Med-TeluguStop.com

దీనివల్ల కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడమే కాకుండా, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురయ్యాయి.ఒకవైపు అలా ఉండగా మరోవైపు ఎంతో మంది ప్రాణాలను కాపాడిన రోజులు కూడా ఉన్నాయి.

అయితే సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్స్ అప్ లాంటి వాటిని ఉపయోగించి సమాచారాన్ని అవసరం ఉన్న, లేకున్నా కొన్ని విషయాలను తెగ ఫావర్డ్ చేస్తుంటారు కొందరు.

అయితే అవి ఎవరు పెట్టారు…? అందులో విషయం ఏమిటి…? ఎక్కడ నుంచి చేస్తున్నారు, ఎప్పుడు అప్లోడ్ చేశారు, ఏ విషయం కోసం దీనిని ఉంచారు అని ఆలోచించే తత్వం లేకుండా వాటిని ఫార్వర్డ్ చేస్తున్నారు కొందరు.దీంతో కొందరు చట్ట పరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.అంతేకాదు సదరు గ్రూపుకు చెందిన అడ్మిన్స్ చిక్కుల్లో పడాల్సి వస్తుంది.అందుకోసం ముందుగా అడ్మిన్స్ పోస్ట్ చేసే ముందు మనకు వచ్చిన సమాచారం కరెక్టా లేదా దాన్ని ఎవరు పంపారు, అలాగే అనేక కోణాల్లో ఆలోచించి దానిపై ఎటువంటి చట్టబద్ధమైన సమస్యలు రాకుండా చూసుకోవాలి.

ఇక ఆ తర్వాత అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు కొన్ని వార్తలను వ్యాప్తి చేస్తుంటారు.

ఈ విషయాన్ని కూడా గమనించి అది ఉపయోగకరమైన లేదా అన్న కోణంలో ఆలోచించి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.ఇక మీకు అందిన సమాచారం నిజమా, కాదా… అన్న ఆలోచన చేసి నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని పోస్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

కొన్ని విషయాలు మోసపూరిత ఆలోచనలు కలిగి ఉండటం గమనిస్తూ ఉంటాము.అలాంటి వాటికీ ఎంత దూరంగా ఉండే అంత సేఫ్ గా ఉండొచ్చు.చివరగా మీరు ఓ విషయాన్ని తీసుకొని దానిని మీకు సంబంధించిన గ్రూపులలో ఫార్వర్డ్ చేయడానికి కచ్చితంగా మీరు వాడే ఫోటో, వీడియో ను ఒకటికి రెండుసార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే దానిని ఫార్వర్డ్ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube