దానితో టచ్ లో ఉండటం వల్ల...అసలు "టచ్" మిస్ అవుతున్నారు చాలా మంది.! మరి మీరు?     2018-06-13   03:06:50  IST  Raghu V

సోషల్ మీడియా…మనకు తెలియకుండానే మన జీవితంలో అత్యధిక పాత్ర పోషిస్తుంది. ఉదయం లేవగానే వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ తో మొదలుపెట్టి, రాత్రి పడుకునేటప్పుడు ఫేస్బుక్ లో గుడ్ నైట్ పోస్ట్ తో డే ముగిస్తున్నాము. దూరంగా ఉండేవాళ్ళని దగ్గర చూపిస్తుంది సోషల్ మీడియా. కానీ దగ్గరి వాళ్ళని దూరం చేస్తుంది. సోషల్ మీడియా కి అడిక్ట్ అయ్యి, మన వాళ్ళతో మనం మాట్లాడుకోవడం మానేసాము.

అందర్నీ కలవడం కుదరడం లేదు కాబట్టి సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నామని ఫీలవుతున్నారా..? టచ్‌లో ఉంటున్న మాట నిజమే కానీ మీరు అసలు ‘టచ్’ను మిస్సవుతున్నారు. ఇది మేం చెబుతోంది కాదు. ఎంతో అనుభవం ఉన్న 90 ఏళ్ల సెక్స్ థెరపిస్ట్ డాక్టర్ రుత్ వెస్థీమెర్ చెబుతున్న మాటలివి.