బిగ్ బాస్ 2 లో ఏమైనా జరగొచ్చు..! అంటే ఈ లిప్-లాక్ ఏంటి.? సోషల్ మీడియాలో కామెంట్స్.!       2018-06-23   22:43:07  IST  Raghu V

‘బిగ్‌బాస్ 2’ తెలుగులో గొడవలతో వాడీవేడిగా సాగుతుంటే.. తమిళంలో మాత్రం హాట్ హాట్‌గా సాగుతోంది. మొదటి సీజన్లో నటి నమితా సెంటర్ ఆఫ్ ది అట్రాక్స్ కాగా, ఈ సీజన్లో మరో అందాల తార ముంతాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్‌-2 కూడా వారం రోజుల కిందటే ప్రారంభమైంది.

ముంతాజ్‌కు, హౌస్‌మేట్స్‌కు క్షణం కూడా పడటం లేదు. రోజూ ఏదో ఒక గొడవ. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగం నటులు జనని, వైష్ణవీలు మీసాలు పెట్టుకోవాలని, ముంతాజ్, బాలాజీలు డైపర్లు వేసుకుని చిన్న పిల్లలా అల్లరి చేశారు. ఐశ్వర్య దత్త, రమ్య కవల పిల్లలుగా నటించారు. అయితే, మగాడి వేషంలో ఉన్న జనని.. ఐశ్వర్యను టీజ్ చేస్తూ లిప్‌లాక్ పెట్టడం ట్రేండింగ్ టాపిక్ గా మారింది.

మొదటి వారంలో హౌస్ కెప్టెన్ కోసం జరిగిన పోటీలో జననీ విజయం సాధించి, ఆ బాధ్యతలు తీసుకుంది. మొదటి రోజు నుంచే ముంతాజ్ అందరితో గొడవపడుతూ.. హౌస్‌మేట్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దీంతో ఈ వారం జరిగే తొలి ఎలిమినేషన్ జాబితాలో ముంతాజ్ పేరు ఉంది. ఆమెతోపాటు నిత్యా బాలాజీ, అనంత్, రిత్వికాల పేర్లు కూడా నామినేషన్‌లో ఉన్నాయి.