ఛీ..ఛీ .. శ్రీదేవి కూతురు తల్లి పరువు తీసింది.! పేస్బుక్ లో ఫాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ?       2018-06-27   23:11:32  IST  Raghu V

కొద్దిరోజులుగా తెగ హడావుడి చేస్తోంది శ్రీదేవి కూతురు జాన్వికపూర్. జూలై 20న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తూనే మరోవైపు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విరివిగా అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్‌తో షాక్ ఇచ్చింది జాన్వి. అందులో ఈమెని చూసినవాళ్లు జాన్వికపూర్ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందా? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. లైట్‌గా అందాలు ఆరబోస్తూనే, సెక్సీ లుక్స్‌‌తో యూత్‌ని పిచ్చెక్కించింది. డ్రెస్సుల్లో వెరైటీగా కనిపించింది.

ధర్మా ప్రొడక్షన్స్ జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాహ్నవికి జోడీగా హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నారు. ప్రేమ-పగల నేపథ్యంలో తెరకెక్కి మారాఠీలో అద్భుతం విజయం సాధించిన సైరాత్ ను హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 20 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

ఇప్పుడున్న హీరోయిన్లకు తానేమీ తీసిపోనని నిరూపించే ప్రయత్నం చేసింది. ఆమె మొదట నుంచి అటు మోడ్రన్‌నే కాకుండా సంప్రదాయబద్ధమైన దుస్తులనూ ధరిస్తూ యూత్‌ ఐకాన్‌గా నిలుస్తున్నారు.

“ధడక్‌” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ ఫ్యాషన్‌లో తనదైన శైలిని అనుకరిస్తారు. సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారు. తొలిసారిగా జాన్వీ అనుసరిస్తున్న ‘వోగ్‌ ఇండియా’ మ్యాగజైన్‌పై కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ‘‘తల్లి చనిపోయి కొన్ని నెలలు కూడా దాటలేదు. అప్పుడే సినిమా ప్రమోషన్లు, ఫొటోషూట్లు ఏంటి?’’ అంటూ చాలా మంది దుమ్మెత్తిపోశారు. అయితే వీటికి జాన్వీ మాత్రం స్పందించలేదు. అయితే ఈ ఫోటోల్లో జాన్వీ అందం చూసి యూత్‌ ఫిదా అయిపోయారు.