బాబోయ్‌.. అమ్మను మరో రెండు వారాలు భరించాల్సిందేనా?

తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులకు అమ్మ రాజశేఖర్‌ పెద్ద తలనొప్పిగా మారాడు.ఆయన ప్రతి చిన్న విషయానికి గొడవ పడటంతో ఇంటి సభ్యులు కూడా ఆయన వల్ల పదే పదే డిస్ట్రబ్‌ అవుతున్నారు.

 Social Media Comments On Bigg Boss 4 Contestant Amma Rajashekhar , Amma Rajasek-TeluguStop.com

ఆయన మాట నెగ్గే విధంగా ఆయన జోకులనే వావ్‌ అనేలా ఆయన ప్రవర్తించే తీరు విమర్శలకు తెర తీస్తుంది.ఎవరైనా ఆయన్ను నామినేట్‌ చేస్తే గొడవ చేస్తాడు.

ప్రతి వారం ఆయన నామినేట్‌ తర్వాత రచ్చ చేయడం పరిపాటిగా వస్తుంది.గత వారం సోహెల్‌ నామినేట్‌ చేసినందుకు చాలా పెద్ద రచ్చ చేశాడు.

తన ప్రతీ పనిని అందురూ సమర్థించాలి, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలంటూ ఆయన మనస్థత్వం ఉంటుంది.ఒక వేళ అలా ఒప్పుకోకుంటే ఆయనకు మండుతుంది.

దాంతో మళ్లీ రచ్చ చేస్తాడు.ఈ వారం మళ్లీ అమ్మ రాజశేఖర్‌ నామినేషన్‌లోకి వచ్చినట్లుగా ఉన్నాడు.
నేడు ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోలో అమ్మ రాజశేఖర్‌ మరియు అభిజిత్‌ల మద్య గొడవ తారా స్థాయికి చేరింది.ఆ గొడవలో నేను కింది నుండి పైకి వచ్చాను అంటూ అమ్మ రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

నిన్న ఆదివారం ఆయన ఎలిమినేట్‌ అవుతాడు అనుకుంటే నోయల్‌ అనారోగ్య కారణాల వల్ల బయటకు వెళ్లి ఈ వారం ఎలిమినేషన్‌ లేకుండా చేశాడు.అదే సమయంలో నిన్న నాగార్జున ఈ వారం కెప్టెన్సీ పోటీ దారుడుగా అమ్మ రాజశేఖర్‌ను నేరుగా పంపిస్తున్నట్లుగా ప్రకటించాడు.

ఒక వేళ అమ్మ రాజశేఖర్‌ ఈ వారం ఎలిమినేట్‌ అవ్వకుంటే వచ్చే వారం కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంది.అంటే మరో రెండు వారాలు ఆయన్ను భరించాల్సి రావచ్చు అంటూ ప్రేక్షకులు బాబోయ్‌ ఇంకా ఎన్ని రోజులు ఈయన్ను భరించాలంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతున్నారు.

అమ్మ రాజశేఖర్‌ మొత్తం విమర్శల పాలవుతున్నాడు.ఇప్పటికి అయినా ఆయన బయటకు వస్తే కాస్త అయినా నెగటివిటీ తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube