బిగ్‌బాస్‌ 3 రైల్‌ టాస్క్‌ గురించి సోషల్‌ మీడియా కామెంట్స్‌ ఏంటో తెలుసా?  

Social Media Comments On Bigg Boss 3 Telugu Rail Task-bigg Boss 3 Telugu,boring Tasks,nagarjuna,rail Task,social Media Comments

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది.మొదటి వారం మంచి రేటింగ్‌ దక్కించుకున్న బిగ్‌బాస్‌ రెండవ వారం నుండి డౌన్‌ ఫాల్‌ మొదలైంది.అది ఎంతగా అంటే కనీసం ఈటీవీ న్యూస్‌ చూసే వారి సంఖ్య మేరకు కూడా బిగ్‌బాస్‌ చూస్తున్న వారి సంఖ్య లేదు.

Social Media Comments On Bigg Boss 3 Telugu Rail Task-bigg Boss 3 Telugu,boring Tasks,nagarjuna,rail Task,social Media Comments-Social Media Comments On Bigg Boss 3 Telugu Rail Task-Bigg Boring Tasks Nagarjuna Rail Task

అత్యంత ప్రమాదకర స్థాయిలో రేటింగ్‌ ఉన్న ఈ సమయంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఏమైన చేసి రేటింగ్‌ పెంచేందుకు ప్రయత్నించాలి.కాని అలా జరగడం లేదు.

Social Media Comments On Bigg Boss 3 Telugu Rail Task-bigg Boss 3 Telugu,boring Tasks,nagarjuna,rail Task,social Media Comments-Social Media Comments On Bigg Boss 3 Telugu Rail Task-Bigg Boring Tasks Nagarjuna Rail Task

తాజాగా నిన్న మరియు నేడు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్‌ మరీ బోరింగ్‌గా ఉంది.

రైల్‌ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు దేశంలోని ముఖ్య పట్టణాల్లో ఎంజాయ్‌ చేయాల్సి ఉంటుంది.రైలు ప్రయాణంను ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగించాల్సి ఉంటుంది.కాని బిగ్‌బాస్‌ వేసిన ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.ఏమాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకుండా బిగ్‌బాస్‌ రైలు ప్రయాణం సాగుతోంది.ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కన పెడితే వారి వేశాలు బోరింగ్‌గా అనిపిస్తున్నాయి.

బిగ్‌బాస్‌ రైల్‌ టాస్క్‌ గురించి సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చగా కామెంట్స్‌ వస్తున్నాయి.ఆ రైల్‌ కింద పడి చావురా బిగ్‌బాస్‌ అంటూ కొందరు, ఇది రైలు ప్రయాణంలా లేదు చేపల మార్కెట్‌లో వ్యాపారంలా ఉందని మరి కొందరు ఇలా ఇష్టానుసారంగా ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈ టాస్క్‌ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదని పరమ చెత్తగా ఉందని కొందరు సోషల్‌ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.మా టైం వృదా చేసేలా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ నెటిజన్స్‌ బిగ్‌బాస్‌ నిర్వాహకులపై మండి పడుతున్నారు.

ఇలాగే కొనసాగితే రేటింగ్‌ మరింత దారుణంగా పడిపోయి వంద రోజులు కంటిన్యూ చేసే అవకాశం కూడా లేదని అంటున్నారు.