బిగ్‌బాస్‌ 2 నాని హోస్టింగ్‌పై సోషల్‌ కామెంట్స్‌

హిందీ బుల్లి తెరపై సంచన విజయాన్ని సొంతం చేసుకున్న బిగ్‌బాస్‌ను గత సంవత్సరం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు.

 Social Comments On Bigg Boss 2 Nani Hosting-TeluguStop.com

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన ఎనర్జితో బిగ్‌బాస్‌ను అద్బుతంగా ఆవిష్కరించాడు.షో మొదటి సీజన్‌ అవ్వడంతో పాటు, ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ అవ్వడం వల్ల భారీ టీఆర్పీ రేటింగ్‌ దక్కింది.

తెలుగులో ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని స్టార్‌ మా వారు కూడా ఊహించలేదు.అంతటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగానే రెండవ సీజన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్‌బాస్‌ తాజాగా ప్రారంభం అయ్యింది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయలేను అంటూ తేల్చి చెప్పాడు.సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ఎన్టీఆర్‌ షో నుండి తప్పుకున్నాడు.ఎన్టీఆర్‌ స్థానంలో ఎవరైతే బాగుంటుందని భావిస్తున్న సమయంలో ఆసక్తికరంగా నాని పేరు బయటకు వచ్చింది.

నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సహజ నటుడిగా పేరున్న నాని హోస్ట్‌ పాత్రను కూడా మడతపెట్టి మరీ చేసేస్తాడు అని అంతా భావించారు.

కాని అనూహ్యంగా బుల్లి తెరపై బిగ్‌బాస్‌ను ఆశించిన స్థాయిలో ఆయన నడిపించడంలో విఫలం అవుతున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మొదటి రోజు సెలబ్రెటీలను పరిచయం చేయడం వరకే ఆయన హోస్టింగ్‌ సాగింది.

కనుక ఆ రోజు పెద్దగా నాని ప్రతిభ తెలియలేదు.కాని తాజాగా ప్రసారం అయిన శని, ఆదివారాల ఎపిసోడ్‌లో నాని హోస్టింగ్‌ తేలిపోయిందని చెప్పక తప్పదు.

ముఖ్యంగా శనివారం నాడు నాని చాలా ఇబ్బందిగా అనిపించాడు.పలు సార్లు డైలాగ్‌ను తప్పుగా చెప్పడం, కంగారు పడటం కనిపించింది.

పలు విషయాల్లో తత్తర పాటును నాని కనబర్చాడు.దాంతో నాని బిగ్‌బాస్‌కు అన్‌ ఫిట్‌ అంటూ తేల్చి పారేస్తున్నారు.

అయితే ఆదివారం మాత్రం పర్వాలేదు అనిపించాడు.శనివారంతో పోల్చితే ఆదివారం నాడు తత్తరపాటు తగ్గింది.

వారాలు గడుస్తున్నా కొద్ది నాని హోస్టింగ్‌ మారిపోతుందని, తప్పకుండా మరో రెండు మూడు వారాల్లో అందరు మెచ్చే విధంగా హోస్టింగ్‌ చేస్తాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాని ఏ పాత్ర ఇచ్చినా కూడా విలీనం అవుతాడు.

అలాగే ఈ హోస్టింగ్‌ పాత్రలో కూడా ఆయన విలీనం అవ్వడం ఖాయం అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే నాని హోస్టింగ్‌ సూపర్‌ అంటూ అందరితో అనిపించుకుంటాడో లేక ఈ నానిగాడు ఎందుకు హోస్టింగ్‌ చేస్తున్నాడురా బాబోయ్‌ అనిపించుకుంటాడో చూడాలి.

సినిమాలతో బిజీగా ఉంటూనే హోస్టింగ్‌ను చేస్తున్న నాని త్వరలోనే కొత్త సినిమాలకు కూడా సిద్దం అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube