తెనాలి భామ అడల్ట్ వెబ్ సిరిస్! మేడ్ ఇన్ హవెన్!

ప్రస్తుతం ఇండియాలో సినిమాలకి మించే విధంగా వెబ్ సిరిస్ ట్రెండ్ దూసుకొస్తుంది.ఇప్పటికే హిందీలో వెబ్ సిరిస్ లని తెరకెక్కించడం దర్శక, నిర్మాతలు ఫుల్ బిజీగా వున్నారు.

 Sobhita Dhulipala Web Series Made In Heaven Trailer Release-TeluguStop.com

అక్కడ స్టార్ కథానాయికలు సైతం వెబ్ సిరిస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక తెలుగులో ఆ మధ్య గ్యాంగ్ స్టార్ అనే వెబ్ సిరిస్ వచ్చిన అది పెద్దగా క్లిక్ కాలేదు.

అయితే సూపర్ స్టార్ మహేశ్ వెబ్ సిరిస్ ల నిర్మాణంలోకి దిగి చార్లీ అనే వెబ్ సిరిస్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.ఇదిలా వుంటే తెలుగు నేల నుంచి ముంబై ఫాషన్ ప్రపంచంలో అడుగుపెట్టి మిస్ ఇండియాగా ఎంపికైన శోభిత దూలిపాళ్ళ అందరికి తెలిసే వుంటుంది.

రీసెంట్ గా ఆమె గూడచారి సినిమాలో అడవి శేష్ కి జోడీగా నటించింది.అయితే ఈ భామ బీటౌన్ లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాల ప్రదర్శనకి, బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి ఒకే అనడంతో ఈ భామకి బాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయి.

మొదటి సినిమాలోనే న్యూడ్ గా నటించిన ఈ భామ తాజాగా ఓ వెబ్ సిరిస్ లో నటిస్తుంది.

తాజాగా ఈ వెబ్ సిరిస్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింద.

పెళ్ళిళ్ళు సర్గంలో జరుగుతాయి అంటూ ఇండియాలో జరిగే సంప్రదాయ పెళ్ళిళ్ళపై సెటైరికల్ గా ఈ వెబ్ సిరిస్ తెరకెక్కుతుంది.మేడ్ ఇన్ హవెన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరిస్ లో మన తెనాలి పిల్ల, శోభిత దూలిపాళ్ళ మెయిల్ లీడ్ లో నటిస్తుంది.

అయితే ఆమె పాత్ర ట్రెడిషనల్ గా కాకుండా చాలా బోల్డ్ గా కాల్ గర్ల్ తరహాలో వుంది.తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ట్రైలర్ లో శోభిత బోల్డ్ అందాలతో పాటు, అధర చుంబనాలతో రెచ్చిపోయింది అని చెప్పాలి.

హిందీలో ఈ మధ్య కాలంలో తెరకెక్కుతున్న అడల్ట్ వెబ్ సిరిస్ ల తరహాలోనే ఇది కూడా తెరకెక్కడం విశేషం.ఈ వెబ్ సిరిస్ ని నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ అవుతుంది.

మరి ఇందులో మన తెలుగమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎ రేంజ్ లో ఉండబోతుంది అనేది ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.మరి ఈ వెబ్ సిరిస్ ఆమెకి ఎ మేరకు సక్సెస్ ఇస్తుంది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube