ఆ శోభన్ బాబు ఇక లేడు అంటు ఎమోషనల్ అయిన హీరో

తెలుగు సినిమా పరిశ్రమలో అందాల హీరోగా గుర్తింపు పొందిన నటుడు శోభన్ బాబు.సోగ్గాడిగా గుర్తింపు పొందిన ఆయన ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి జనాల మదిలో నిలిచిపోయాడు.

 Sobhan Babu About His Age That Shobhan Babu Is No Longer An Infectious Emotiona-TeluguStop.com

తన కెరీర్ చివరి రోజుల్లో ఎన్నో పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా తను వద్దు అనుకున్నాడు.బ్లాంక్ చెక్ ఇచ్చి తమ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయమని రిక్వెస్ట్ చేసినా అంగీకరించలేదు శోభన్ బాబు.

సినిమాల విషయంలో దర్శకుడు కోదండరామిరెడ్డికి, శోభన్ బాబుకు మధ్య ఓ సారి చర్చ జరిగిందట.వీరిద్దరు నిజానికి మంచి మిత్రులు.అందుకే ఇద్దరూ అన్ని విషయాల గురించి మాట్లాడుకునేవారు.వీరి మధ్య ఏనాడూ దాపరికాలు ఉండేవి కాదు.

ఆ రోజుల్లో శోభన్ బాబుతో స్నేహంగా ఉండేందుకు అందరూ ప్రయత్నించేవారు.సినిమా రంగానికి చెందిన అందరూ ఇతడితో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకునే వారు.

కానీ శోభన్ బాబు మాత్రం ఐదుగురితో మాత్రమే ఎక్కువ చనువుగా ఉండేవాడు.వారిలో ఒకరు దర్శకుడు కోదండ రామిరెడ్డి.

తనకు ఏ సమస్య వచ్చినా ముందు శోభన్ బాబుతో చెప్పుకునే వాడు కోదండ.అటు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్ కు వచ్చినా శోభన్ బాబు మాత్రం మద్రాసులోనే ఉన్నాడు.

Telugu Shobhan Babu, Hyderabad, Kodanda Rami, Madras, Sobhan Babu-Telugu Stop Ex

కోదండ రామిరెడ్డి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.వీరు వేర్వేరు చోట్ల ఉన్నా.ఏనాడూ వీరి మధ్య స్నేహం పలుచబడలేదు.కోదండం ఎప్పుడు మద్రాసుకు వెళ్లిన తొలుత శోభన్ బాబు దగ్గరికే వెళ్లేవాడు.శోభన్ బాబు కూడా రామిరెడ్డికి అత్యంత గౌరవం ఇచ్చేవాడు.స్నేహితుడు ఇంటికి వస్తే చాలు రకరకాల వంటకాలు చేసి తినిపించేవాడు.

నాకంటే షుగర్ గట్రా ఉన్నాయి.నువ్వైనా తినవయ్యా అని శోభన్ బాబు దగ్గరుండి వడ్డించేవాడు.

తింటూ మాటల మధ్యలో కనీసం గెస్టు రోల్స్ అయినా చెయ్యొచ్చు కదా అని అడిగేవాడు కోదండ రామిరెడ్డి ఆ శోభన్ బాబు ఇప్పుడు లేడు.జుట్టు ఊడిపోయింది.

వయసు పెరిగిపోయింది.అందుకే సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పేవాడు శోభన్ బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube