నానబెట్టిన బాదం తినొచ్చా..? ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

బాదం.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 What Happens When You Eat Soaked Almonds Everyday?, Soaked Almonds, Almonds, Eat-TeluguStop.com

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు తిన‌‌గ‌లిగే ఆహారంలో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి.సూపర్‌ ఫుడ్‌గా పిల‌వ‌బ‌డే బాదంలో న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి.

ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్ప‌డ‌తాయి.బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అలాగే బాదం ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది.ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి.త‌ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది.అయితే నానబెట్టిన బాదం తినొచ్చా.? అన్న‌ది చాలా మందిలో ఉండే సందేహం.వాస్త‌వానికి కొంద‌రు నాన‌బెట్టిన బాదం తింటే.

మ‌రికొంద‌రు బాదంను డైరెక్ట్‌గా తింటుంటారు.కానీ, నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది.

ఎందుకు మంచిది అంటే.బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది.అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది.ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది.

అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.అందులోనూ ముఖ్యంగా రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ఇలా క్ర‌మం తప్ప‌కుండా బాదంను తిన‌డం వ‌ల్ల‌ జ్ఞాపకశక్తి మెరుగుప‌డుతుంది.ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బాదం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.ఎందుకంటే.బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది.

ఈ క్ర‌మంలోనే ఆకలి తగ్గిస్తుంది.త‌ద్వారా బరువు త‌గ్గొచ్చు.

మ‌రియు బాదంలో ఉండే బి17 లో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ నివారణలో స‌హాప‌డ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube