వామ్మో.. కరోనా వ్యాక్సిన్ తో ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా..!

గత కొద్దిరోజుల నుంచి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అన్ని దేశాల శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి వాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.అయితే కొన్ని ఫార్మా కంపెనీలు మాత్రం ఇప్పటికే మొదటి దశ, రెండవ దశ ట్రయల్స్ ను నిర్వహించాయి.

 So Many Side Effects With Corona Vaccine-TeluguStop.com

తొందరలోనే మూడవ దశ పూర్తి చేసుకుని మార్కెట్లో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని భావిస్తున్నప్పటికీ, ఈ వ్యాక్సిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించిన వారిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని, వైద్యులు తెలియజేశారు అయితే కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వారు వివరించారు.మోడెర్నా ఫార్మా కంపెనీ ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసుకుంది.

 So Many Side Effects With Corona Vaccine-వామ్మో.. కరోనా వ్యాక్సిన్ తో ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు ఫైజర్ మూడోదశ ట్రయల్స్ పూర్తిచేసుకుని ఫలితాలను విడుదల చేసింది.అంతేకాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా రెండవ దశ ట్రయల్స్ ఫలితాలను విడుదల చేసింది.

ఈ మూడు వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సమర్థవంతంగా పనిచేసాయని నిపుణులు తెలియజేశారు.

సాధారణంగా వ్యాక్సిన్లు వేసేటప్పుడు మన శరీరంలో టీ కణాలు యాక్టివ్ గా ఉండి రోగనిరోధక శక్తిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ఈ క్రమంలోనే కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.అయితే ఈ మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తులలో అలసట, కండరాల నొప్పులు, అధిక జ్వరం, వ్యాక్సిన్ వేయించుకున్న చోట ఎర్రగా కందిపోవడం, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని అధికారులు తెలియజేశారు.

ఏదైనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా శరీరంలో అవాంతరాలు ఏర్పడితే వ్యాక్సిన్ ట్రయల్స్ ను నిలిపివేస్తారు.ప్రస్తుతం ఈ మూడు వ్యాక్సిన్ లలో మోడెర్నా, పైజర్ వ్యాక్సిన్లకు అధిక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సమాచారం.ఏదిఏమైనా అందరికీ ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్ మార్కెట్లో దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

#ModernaPfizer #Effects #Corona Vaccine #EffectsCorona #Muscle Aches

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు