చంద్రబాబు ని వేదిస్తున్న “పది” ప్రశ్నలు ఇవే     2018-01-20   09:00:47  IST  Bhanu C

ఎంత కష్టమైనా పర్వాలేదు..ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే గుండెల నిండా దైర్యం ఉంది నేను పోలవరం ప్రాజెక్ట్ 2019 క‌ల్లా పూర్తిచేసి తీరుతాను అంటూ చంద్రబాబు ప్రతిన పూనిన సందర్భం అందరికీ గుర్తు ఉండేఉంటుంది..అయితే కేంద్రం బాబు కి మొకాలడ్డుతున్న సమయంలో కూడా చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాను అంటూ చెప్పారు ఈ దశలోనే కాంట్రాక్ట‌ర్ ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ప‌నులు పూర్తిచేయ‌లేద‌ని, మిగిలిన ప‌నులకు టెండ‌ర్లు పిలుస్తామ‌ని కోరినా కేంద్రం స‌సేమిరా అనడంతో కేంద్రంపై తిరుగుబాటు చేస్తున్నారు.

అయితే ఈ పరిణామాలు అన్నీ కూడా చంద్రబాబు కొట్లలో అవినీతి చేయడానికే అని ఆరోపణలు వస్తున్నాయి..మొదటి నుంచీ ఎన్నో ఆరోపణలు వస్తున్నా సరే వారికి సరైన సమాధానం చెప్ప‌లేక‌పోతున్నారు చంద్ర‌బాబు…అయితే ఈపోలవరం విషయంలో బాబు మరో కొత్త కంపెనీ పేరు వినిపించడం తెరమీదకి తీసుకురావడం వెనుక పెద్ద తతంగం నడిచింది అంటున్నారు..అసలు గుట్టుబాటు ధర లేకపోతే ఎంత అభిమానం ఉన్నాసరే పని చేయలేరు..అయితే ఈ విషయంలో చంద్రబాబు చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అవేమిటంటే..

1 . అంచనాలు పెంచేసిన లాభం లేకుండ పనులు చేసేయండి అంటే..చంద్రబాబు మాట మాకు వేదవాక్కు అంటూ ఎవరు నష్టాలలో ముందుకు వస్తారు అది కూడా ఓ ప్రైవేటు సంస్థ

2. ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తానన్న కేంద్ర మంత్రి గడ్కరీ ఇఫ్పటి వరకూ ఇటువైపు చూడకపోవటానికి కారణం ఏమిటి?

3. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాంట్రాక్ట్ సంస్థ అయినా నష్టం వచ్చినా సరే.. ముందుకొస్తుందా?

4. నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థా? లేక స్వచ్చంద సంస్థా?

5. వారం రోజుల్లోనే కొత్త టెండర్లలో అంచనాలు రూ. 80 కోట్లు పెరిగిన వైనంపై కూడా కేంద్రం గుర్రుగా ఉందా?

6. నవయుగ పాత రేట్లకు చేయగలిగినప్పుడు చంద్రబాబు ఇంత కాలం మద్దతు ఇచ్చి అండగా నిలిచిన అధికారిక కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ ఇదే పని ఎందుకు చేయలేకపోయింది. ఇన్ని వివాదాలకు కారణం ఎందుకు అయినట్లు?

7. చంద్రబాబు సర్కారు పిలిచిన కొత్త టెండర్లలో అక్రమాలు ఉన్నందునే పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) వీటిని ఆమోదించలేదా?

8. పోలవరంలో ఏదో ఉదారంగా పని చేసినందుకు నవయుగాకు ఏపీలో ఉన్న ఓడరేవు ప్రాజెక్టులు..కాంట్రాక్ట్ సంస్థల్లో చంద్రబాబు సర్కారు పరోక్ష ప్రయోజనం కల్పించనుందా? వీళ్లిద్దరి మధ్య కుదరిన రహస్య ఒప్పందం ఏంటి?

9. కేంద్రమే చర్చల ద్వారా పాత రేట్లకు పనిచేసే కాంట్రాక్టర్ ఎంపిక చేయమని ఆదేశించిందా?

10. వైఎస్ హయాంలో నవయుగా సంస్థపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే సంస్థతో అంటకాగటం వెనక ఉన్న మతలబు ఏమిటి?