పవన్ గెలుపుపై ఎన్నో సందేహాలు... 'షో '....ఫ్లాప్ అవుతుందా..???  

So Many Questions On Pawan Kalyan Janasena Win-doubts On Pawan Kalyan Winning,janasena,pawan Kalyan Janasena,tdp,ycp,ys Jagan

 • ఏపీలో లో భారీ అంచనాల మధ్య ఎన్నికల్లోకి దిగిన పవన్ కళ్యాణ్ గట్టెక్కినట్టేనా.?? పవన్ ని ప్రజలు ఆదరించారా, లేక తమ ఓటు తో తిరస్కరించారా.

 • పవన్ గెలుపుపై ఎన్నో సందేహాలు... 'షో '....ఫ్లాప్ అవుతుందా..???-So Many Questions On Pawan Kalyan Janasena Win

 • ?? అనేటువంటి అనుమానాలు అందరిలో ఉత్పన్నమవుతున్నాయి. 2014లోనే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ , అప్పటి ఎన్నికల్లో దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ సాధ్యమైనన్ని స్థానాలలో తమ అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికల సంగ్రామంలో దూకింది.

 • పవన్ కళ్యాణ్ కూడా ఎంతో తెలివిగా తన సామాజిక వర్గానికి పట్టున్న గాజువాక క భీమవరం నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఆ స్థానాల నుంచి పోటీ చేయడం గమనార్హం.

  So Many Questions On Pawan Kalyan Janasena Win-Doubts Winning Janasena Pawan Tdp Ycp Ys Jagan

  ఇదిలా ఉంటే గతంలో కూడా వివిధ పార్టీల అధినేతలు రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు సైతం రెండు చోట్ల నుంచి పోటీ చేశారు.

 • అలాగే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు తిరుపతి పాలకొల్లు రెండు స్థానాల నుంచి పోటీ చేసి తిరుపతి నుంచి మాత్రమే గెలుపొందారు. అయితే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ప్రజలు పట్టం కట్టే పరిస్థితి ఉందా అంటే పరిశీలకులు మాత్రం చివరి నిమిషంలో లో ప్రజలు పవన్ ని నమ్మలేదని అంటున్నారు.

 • ఎందుకంటపవన్ పై మొదట్లో ప్రజలకున్న నమ్మకం చివరి వరకు కొనసాగాక పోవడానికి కారణం ఏమిటంటే. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

 • కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన డిమాండ్ అయిన రిజర్వేషన్ బీసీ లో చేర్చడం అనే విషయం పై పవన్ కు ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోవడం ఒకటైతే, పైగా ఆ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో కాపు సంఘాలన్నీ పవన్ పై గుర్రుగా ఉన్నాయట. అంతేకాదు ఎన్నికలు సమీపించిన తరుణంలో కాపులు అందరూ టీడీపీ పై నిప్పులు చెరుగుతూ ఉంటే.

 • పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం వారికి అసలు మింగుడు పడలేదట.

  So Many Questions On Pawan Kalyan Janasena Win-Doubts Winning Janasena Pawan Tdp Ycp Ys Jagan

  అట ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం పై పెట్టిన దృష్టి చంద్రబాబుపై ఎందుకు పెట్టలేదని బహిరంగ విమర్శలు కూడా చేశారట. ఏపీ ప్రజలందరూ ఎంతగానో ఆశ పెట్టుకున్న అమరావతి , పోలవరం పై పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేక పోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 • రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు , డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల సరళిని బట్టి జనసేన డిజాస్టర్ గా మిగలనుంది అంటున్నారు విశ్లేషకులు.

 • చాలా నియోజకవర్గాల్లో జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు పవన్ కనీసం తన అన్న చిరంజీవి గెలిచినట్టు ఒక నియోజకవర్గంలో అయినా సరే గెలుస్తాడా లేదా రెండు నియోజకవర్గాల్లో ఒడి చరిత్ర సృష్టిస్తాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 • ఓవరాల్ గా చూసుకుంటే పవన్ ఒక స్థానం గెలిచినా తనతో పాటు మహా అయితే మరొక ముగ్గురు అభ్యర్ధులు గెలుస్తారని మొత్తంగా 5 నెం దాటే పరిస్థితి లేదని బల్ల గుద్దిమరీ చెప్తున్నారు రాజకీయ పండితులు.