హరీష్ కు దుబ్బాక ఇబ్బందులు ? పదవి ఉంటుందా ఊడుతుందా ?  

So many problems faced on dubhaka elections issues by hareesh rao Harish Rao, Dubbaka Bie Elections, TRS, BJP, Congress, KCR, KTR, Darmapuri Aravindh, - Telugu Bandi Sanjay, Bjp, Cheruku Muthyam Reddy, Cheruku Srinivas Reddy, Dharmapuri Aravind, Dubbaka Elections, Kishan Reddy, Minister Harish Rao, Revanth Reddy, Telangana Bjp President

తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడినట్టుగా కనిపిస్తోంది.రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్ కు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.

TeluguStop.com - So Many Problems Faced On Dubhaka Elections Issues By Hareesh Rao

ఆయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో పదవి ఇవ్వకుండా, కాస్త దూరం పెట్టారు.దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది.

కేటీఆర్ ప్రాధాన్యం టీఆర్ఎస్ లో పెంచేందుకు హరీష్ ను దూరం పెట్టారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.ఇక ఆ తర్వాత పరిణామాల నేపథ్యం లో కేటీఆర్, హరీష్ కు మంత్రి పదవులను కేసీఆర్ కట్టబెట్టారు.

TeluguStop.com - హరీష్ కు దుబ్బాక ఇబ్బందులు పదవి ఉంటుందా ఊడుతుందా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇది ఇలా ఉంటే, ట్రబుల్ షూటర్ గా, పార్టీలో పేరు సంపాదించిన ఆయన తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.

ప్రస్తుతం దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు రావడంతో, ఆ బాధ్యతలు మొత్తం హరీష్ రావు తన భుజాన వేసుకున్నారు.

సిద్దిపేట జిల్లాలో హరీష్ కు బాగా పట్టు ఉండటంతో, కేసీఆర్, హరీష్ కు పూర్తి బాధ్యతను అప్పగించారు.ఇక హరీష్ ఇక్కడ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ, టిఆర్ఎస్కు మైలేజ్ పెంచే విధంగా వ్యవహారాలు చేస్తుండడంతో,  బీజేపీ ఇప్పుడు హరీష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తోంది.

తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హరీష్ ను ఉద్దేశించి చేసిన విమర్శలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కనుక ఓటమి చెందితే, హరీష్ రావు మంత్రి పదవి పోతుందని వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది.

దీంతో అరవింద్ చేసిన విమర్శల్లో నిజం ఉందా అనే కోణం పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.అయితే ఒకవేళ నిజంగానే దుబ్బాక లో టిఆర్ఎస్ ఓటమి చెందుతూ వస్తోంది.

హరీష్ కు మంత్రి పదవి పోయినా, పొకపోయినా, ఆయన ప్రాధాన్యం అయితే బాగా తగ్గిపోతుంది అంటూ అప్పుడే చర్చ మొదలైంది.అయితే ఇప్పటి వరకు హరీష్ తనకు అప్పగించిన అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చారు.

గతంలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ, హరీష్ మార్క్ బాగా కనిపించింది.ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారం దక్కించుకోవడం తో ఆయనపై నమ్మకం మరింతగా పెరిగింది.

అయితే ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో టీఆర్ఎస్ గెలుపు పై సందేహాలు మొదలయ్యాయి.అందుకే ఇక్కడి గెలుపు బాధ్యతలను స్వీకరించిన హరీష్ ను టార్గెట్ చేసుకుంటూ, రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుండడంతో, హరీష్ మంత్రి పదవి పై అనేక సందేహాలు మొదలయ్యాయి.

#CherukuSrinivas #Bandi Sanjay #MinisterHarish #CherukuMuthyam #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

So Many Problems Faced On Dubhaka Elections Issues By Hareesh Rao Related Telugu News,Photos/Pics,Images..