ఒక కత్తి పోటు ! ఎన్నో తడబాట్లు   So Many Doubts On YS Jagans Attack In AP     2018-10-27   09:19:10  IST  Sai M

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కత్తి దాడిపై వెనుక తెలుగుదేశం పార్టీ ఉందనే విపక్షాల అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. మొదటి నుంచి ఈ విషయంపై టిడిపి నేతలు పోలీసులు గాని పొంతన లేని సమాధానాలు చెప్పడం అలాగే నిందితుడు శ్రీనివాసరావు గ్రామంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ మొదట ఒకరకంగా ఉండడం … ఇప్పుడు మరో రకంగా … ఉండడం అలాగే నిందితుడు జేబులో దొరికిన లేఖ అంటూ పోలీసులు చూపిస్తున్న 11 పేజీల లేఖలో మూడు రకాల చేతి రాతలు ఉండడం,
నిందితుడు జేబులో దొరికిందని చెబుతున్న లేక లో ఇటువంటి మాటలు లేకుండా నీట్ గా ఉండడం ఇంకా అనుమానాలు కలిగిస్తోంది. ఏమైనా ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తప్పటడుగులు వేస్తున్నట్టు గానే కనిపిస్తోంది.

తాజాగా… ఈ ఫ్లెక్సీల వ్యవహారంలో ఎటువంటి అనుమానం రాకుండా ఫ్లెక్సీని కొంచెం చించేసి పొలాల్లో పడి ఉందంటూ మీడియాను తీసుకెళ్లి పోలీసులు చూపించారు. అయితే మరోసారి ఇందంతా ఫేక్‌ అని తేలిపోయింది. తొలుత విడుదల చేసిన ఫ్లెక్సీ ఫొటోకు, నిన్న దొరికిందని చూపించిన ఫ్లెక్సీకి మధ్య చాలా తేడాలు బయటపడ్డాయి.
ఫ్లెక్సీ ఫొటోలో హ్యాపీ న్యూ ఇయర్‌ తరువాత రోమన్‌ ‘అండ్‌’ గుర్తు ఒక్కటే ఉండి అనంతరం పొంగల్‌ అని రాసి ఉంది. కానీ శుక్రవారం నాడు పోలీసులు చూపిస్తున్న ఫ్లెక్సీలో రోమన్‌ ‘అండ్‌’తో పాటు కొన్ని పువ్వుల బొమ్మలు కూడా ముద్రించి ఉన్నాయి.

పైగా ఫొటోలో గద్ద బొమ్మ కూడా తేడాగా ఉంది. దీంతో వాటిని పోల్చి చూసిన వారు . లేనిది ఉన్నట్టు ప్రజలను నమ్మించేందుకు టీడీపీ నేతలు, పోలీసులు కలిసి నాటకాలాడుతున్నారని మండిపడుతున్నారు. నిందితుడి వద్ద 11 పేజీల లేఖ ఉందని డీజీపీ చెప్పగానే దాన్ని ఉన్నట్టు చూపించేందుకు ఏకంగా ముగ్గురి చేతిరాతలతో ఉన్న లేఖను మీడియాకు విడుదల చేశారు. కానీ నిందితుడి జేబులో దొరికిన 11 పేజీల లేఖ మడతలు లేకుండా ఉండడం చూసి అందరూ కంగుతిన్నారు. 11 పేజీల లేఖ నిందితుడు జేబులో పెట్టుకుంటే కనీసం మడతలు ఎందుకు లేవని ప్రశ్నించగానే ఇక అటువైపు నుంచి సమాధానం కరువయ్యింది.

So Many Doubts On YS Jagans Attack In AP-

ఈ విషయాలపై సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు ప్లేటు ఫిరాయించారు. నిందితుడి వద్ద లభించిన లేఖ మొత్తం అతను రాసింది కాదని, అతనితో పాటు మరో ఇద్దరు రాశారని విశాఖ సీపీ లడ్హా శుక్రవారం చెప్పుకొచ్చారు. 11 పేజీల లేఖలో తొమ్మిది పేజీలను నిందితుడు తన సోదరి జె.విజయలక్ష్మితో, 10వ పేజీని తనతోపాటే రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రేవతీపతి (19)తో రాయించాడని, చివరి పేజీలో ఉన్న లైన్లను నిందితుడు శ్రీనివాస్‌ స్వయంగా రాసినట్లు లడ్హా వివరించారు. వాస్తవానికి ఆ లేఖ ప్రతులను పరిశీలిస్తే ముగ్గురు రాసినట్టు ఉందని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంవల్లే పోలీసులు ఈ విధంగా కొత్త కథ అల్లారనే ప్రచారం జరుగుతోంది.

2 Attachments