టీడీపీలో ఈ ఎమ్మెల్యేల‌పై అనుమానాలు... పార్టీలో అంత‌ర్మ‌థ‌నం...!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది.క‌రోనా అనంత‌రం.జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాలను.పార్టీ అధినేత చంద్ర‌బాబు చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు.ప్ర‌భుత్వాన్ని ఉతికి ఆరేయాల‌ని అనుకున్నారు.ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను క్రోడీక‌రించుకు ని పెద్ద ఎత్తున 20 అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

 So Many Doubts On Tdp Mla.. Inner Political Talks,vallabhbhaneni Vamsi, Vasupall-TeluguStop.com

ఇలాంటి కీల‌క స‌మావేశాల‌కు అంద‌రూ హాజ‌రు కావాల‌ని చంద్ర‌బాబు మౌఖిక ఆదేశాలు పంపారు.

అంటే.

దీనిని బ‌ట్టి పార్టీకి చెందిన  23 మంది ఎమ్మెల్యేలు హాజ‌ర‌వుతార‌ని టీడీపీ భావించింది.వీరిలో న‌లుగురు ఇప్ప‌టికే వైసీపీకి మ‌ద్ద‌తు దారులుగా మారారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ, వాసుప‌ల్లి గ‌ణేష్‌, మ‌ద్దాలి గిరి, క‌ర‌ణం బ‌ల‌రాంల‌ను ప‌క్క‌న పెడితే.19 మంది ఖ‌చ్చితంగా హాజ‌రు కావాల్సి ఉంది.కానీ, సోమ‌వారం తొలి రోజు స‌భ‌లో క‌నిపించింది.12 మంది మాత్ర‌మే.వీరిలోనూ చంద్ర‌బాబు వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ సినిమా షూటింగుల్లో ఉండ‌డంతో ఆయ‌న‌ను మిన‌హాయించినా.ఏడుగురు ఎమ్మెల్యేలు క‌నిపించ‌లేదు.మ‌రి వీరి ప‌రిస్థితి ఏంటి ? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Telugu Andhra Pradesh, Bala Krishna, Chandra Babu, Latest, War, Tdp-Telugu Polit

ఈ విష‌యం అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం.వీరిలోప్ర‌ధానంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.రాలేదు.

ఈయ‌న వెంట మ‌రో ఇద్ద‌రు ఉన్నార‌ని అంటున్నారు.ఇక‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కూడా తొలి రోజు రాకుండా రెండో రోజు వ‌చ్చి మ‌మః అనిపించేశారు.

ఇక‌, మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి ? అనేది టీడీపీలో చ‌ర్చ‌నీయాంశ‌‌మైంది.గంటా పార్టీ మారిపోతార‌నే ఊహాగానాల నేప‌థ్యంలో ఆయ‌న‌ను టీడీపీ త‌న లెక్క‌లో నుంచి ఎప్పుడో తీసేసింది.

గొట్టిపాటి .ఇత‌ర వివాదాల్లో ఉన్నారు క‌నుక ఆయ‌న కూడా హాజ‌రు కాలేదు.మ‌రిమిగిలిన వారు కూడా పార్టీలో ఉన్న‌ట్టా ?  లేన‌ట్టా?  ఉంటారా ?  వెళ్లిపోతారా ? అనేది టీడీపీకి కొరుకుడు ప‌డ‌ని స‌మ‌స్య‌గా మారింది.ఇక ఉండి ఎమ్మెల్యే మంతెన రాంబాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మ‌న ప్ర‌భుత్వం అని పొగ‌డ‌డంతో టీడీపీ వాళ్లు షాక్‌లో ఉన్నారు.

నిమ్మ‌ల రామానాయుడు కూడా అనుకున్న స్థాయిలో వాయిస్ వినిపించ‌కుండా ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేసింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.ఏదేమైనా ఈ ప‌రిణామాలు టీడీపీని మ‌రింత  డిఫెన్స్‌లో ప‌డేశాయ‌న్న‌ది వాస్త‌వం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube