జనసేనలో గజిబిజి గందరగోళం...???

పార్టీ కమిటీలకి దిక్కులేదుకానీ అసెంబ్లీ అభ్యర్ధుల విషయంలో ఓ కమిటీని వేసేశారు పవన్ కళ్యాణ్ , అంటూ రెండు రోజుల నుంచీ వార్తలు ఊపందుకుంటున్నాయి.అసెంబ్లీ టిక్కెట్ల కోసం ఆశావాహుల నుంచీ వస్తున్న వినతి పత్రాలని స్వీకరిస్తున్నారు కూడా.

 So Many Confusions In Pawan Kalyan Janasena-TeluguStop.com

అందుకు గాను ఓ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు అభ్యర్ధులని కాచి వడపోస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో జనసేన పార్టీపై విసుర్లు ఎక్కువయ్యాయి.ఈ వడపోత కమిటీలో మాదాసు గంగాధరం, అరహం ఖాన్.

హరిప్రసాద్.మహేందర్ రెడ్డి.

శివశంకర్.ఇలా ఐదుగురు సభ్యులు ఉన్న విషయం అందరికి తెలిసిందే…

అయితే వీరు అద్మరూ టిక్కెట్లు ఆశిస్తున్న వారినుంచీ అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.వారిలో పవన్ కళ్యాణ్ సూచించినా ఆ నాలుగు క్వాలిటీలు ఉన్నాయో లేదో చూస్తున్నారట.అయితే ఆ క్వాలిటీలని బలవంతంగా అయినా తమపై రుద్దుకుని వెళ్ళే వారు కూడా ఉంటారనుకోండి.

అయితే వచ్చిన వారిలో ఎవరికీ ఎన్ని క్వాలిటీలు ఉన్నాయనేది మాత్రం ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది.

ఇక పొతే ప్రతీ నియోజకవర్గం నుంచీ ఆశావాహులని వడపోసి వారి సామర్ధ్యాలని లెక్కలు కట్టి ఈ కమిటీ ఓ నివేదిక తయారు చేస్తుంది.

ఆ తరువాత పార్టీ ఆయా నియోజకవర్గాలలో సర్వే చేపడుతుంది.ఈ సర్వేలో నిలబడిన వారి లిస్టు జనరల్ బాడీలోకి వెళ్తుంది.

ఆ ఆతరువాత ఆ జనరల్ బాడీ ఖరారు చేసినవారికి పార్టీ బీఫారమ్ దొరుకుతుంది.ఒక వేళ రిజక్ట్ అయిన వారికి పార్టీ పదువులు అప్పగిస్తారు.

ఇలా ఒకే సారి పార్టీ పదవులకి , అసెంబ్లీ టిక్కెట్ల కి లింకులు పెట్టి మరీ అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు స్వీకరించేలా వ్యూహం రచించారు పవన్.ఇలా చేయడం వలన పెద్దగా అసంత్రుప్తి ఉండదు, చివర్లో నాకు అన్యాయం జరిగిందనే వ్యాఖ్యలు వినిపించవు అనేది జనసేన వ్యూహం అంటున్నారు.కాని అభ్యర్ధుల విషయంలో ఎని రిపోర్టులు తెప్పించుకున్నా సరే అంగబలం , ధనబలం ఉన్నవారికే టిక్కెట్లు దక్కుతాయనేది ఇన్నర్ గా వినిపిస్తున్న వాయిస్.

పవన్ కల్యాణ్ చెబుతున్నట్టు 80శాతం కొత్తవారికి అవకాశమివ్వడం జరిగే పనికాదు.

అయితే జనసేనలో మహిళలకి పెద్ద ఎత్తున టిక్కెట్లు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు.ఈ పరిణామాలని ఒక్క సారి పరిశీలిస్తే జనసేనలో అంతా గజిబిజి గందరగోళంగా ఉందని, పవన్ నావ ఎటువైపు సాగుతుందో.?? చివరకి ఒడ్డుకు చేరుతుందా.??అనే సందేహాలు చాలా మంది నేతల్లో ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube