హీరోయిన్లపై మరీ ఇంత చీప్ కామెంట్సా.. మాజీ డైరెక్టర్ ఇంటర్వ్యూ వైరల్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు కెరీర్ మొదట్లో ఎదుర్కొనే చేదు అనుభవాల గురించి అందరికీ తెలిసిందే.ఎందుకంటే అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు కొన్ని వాటికి లొంగక తప్పదు.

 So Many Cheap Comments On Heroines Director Interview Goes Viral , Geetha Krishn-TeluguStop.com

కొందరు హీరోయిన్లు అవకాశాలు ఇవ్వకపోయినా సరే వాటికి లొంగకుండా సొంత టాలెంట్ తో హీరోయిన్ గా ఎదుగుతారు.ఇక గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్, మీ టు ఉద్యమం ద్వారా హీరోయిన్ల పై జరిగిన లైంగిక దాడులు, వేధింపులు చాలా బయటికి వచ్చాయి.

అందులో చాలా మంది హీరోయిన్లు హీరోల నుండి, దర్శక నిర్మాతల నుండి ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా విషయాలు చెప్పుకున్నారు.మరికొందరు అవకాశాలు ఎక్కడ చేజారి పోతాయో అని చెప్పక తమ మనసులోనే దాపెట్టుకున్నారు.

కొంతమంది నటుల పేర్లు బయటపడటంతో ఆ వ్యవహారాలు పోలీస్ కేసులు, కోర్టు కేసుల వరకు వెళ్లాయి.

కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమకు సినీ పరిశ్రమలో ఎటువంటి అనుభవాలు ఎదురువ్వలేదని చెప్పారు.

నిజానికి సినీ పరిశ్రమలోనే కాకుండా మహిళలు చేసే ఇతర రంగాలలో కూడా లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటాయి.కాని చాలా వరకు అందరూ సినీ పరిశ్రమలోనే ఇటువంటి వేధింపులు ఉంటాయి అని.అవకాశాల కోసం దర్శకనిర్మాతలు హీరోయిన్లను వేధిస్తూ ఉంటారు అని అనుకుంటారు.

Telugu Interview, Geetha Krishna, Sexual, Telugu, Tollywood-Movie

నిజానికి సినీపరిశ్రమలో ఇటువంటివి ఉంటాయని అనుకోవచ్చు కానీ కేవలం ఒక సినీ పరిశ్రమలోనే ఉంటది అని.ఇతర రంగాల్లో ఉండదు అని అనుకోవడం పొరపాటు అని చెప్పాలి.స్త్రీ ఉన్న ప్రతి ఒక్క చోట ఏదో ఒక విధంగా వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి.

కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రమే హీరోయిన్లు అవకాశాల కోసం దిగజారుతారు అని.వారిని ఎవరు ఇబ్బంది పెట్టరు అని తాజాగా ఓ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యలు చేశాడు.

ఇంతకు ఆ మాజీ డైరెక్టర్ ఎవరో కాదు.గీతాకృష్ణ.ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.తెలుగులో సంకీర్తన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత కోకిల, కీచురాళ్ళు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

Telugu Interview, Geetha Krishna, Sexual, Telugu, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఈయన ఎక్కువగా హీరోల విగ్గుల గురించి, హీరోయిన్ల కమిట్మెంట్ ల గురించి దారుణమైన కామెంట్లు చేస్తూ ఉంటాడు.చాలా మంది హీరోయిన్లు కెరీర్ పరంగా ఎదిగేందుకు కమిట్మెంట్ లు ఇస్తారు అని ఆయన ఆరోపించాడు.అంతేకాకుండా కొందరు హీరోయిన్ల పేర్లు కూడా బయట పెట్టడంతో ప్రస్తుతం ఇది వివాదంగా మారింది.దీంతో ఆయన ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ని బ్యాన్ చేయాలి అని బాగా చర్చ జరుగుతుంది.

ఇక ఈయన చేసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ కూడా నెట్టింట్లో వైరల్ గా మారడంతో హీరోయిన్స్ పై ఇంత చీప్ కామెంట్స్ చేస్తాడా అని అంటున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube