ఈట‌ల విష‌యంలో అలా.. వ‌న‌మా విష‌యంలో ఇలా.. కేసీఆర్ ప్లాన్ ఇలా ఉందేంటి..?

అధికార టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీద భూ కబ్జా ఆరోపణలు రాగానే అతడిని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశారు కేసీఆర్.

 So In The Case Of Etala  In The Case Of Vanama  What Is The Kcr Plan , Etala Raj-TeluguStop.com

కానీ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ మీద అనేక విధాలుగా ఆరోపణలు వచ్చాయి.తాను సాగించిన అరాచకాలకు ఒక కుటుంబం బలైపోయింది.

వారు సూసైడ్ చేసుకునే ముందు తమ చావులకు రాఘవనే కారణం అని చెప్పి మరణించారు.అయినా కానీ టీఆర్ఎస్ పార్టీ అతడిని పల్లెత్తు మాట కూడా అనలేదు.

ఆ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.టీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేదు.

కానీ ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది.దీంతో టీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను తాపీగా జారీ చేసింది.రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డ రోజునే అజ్ఞాతంలో ఉన్న రాఘవ పోలీసులకు చిక్కాడు.

ఇంత జరిగినా కానీ రాఘవ తండ్రి వెంకటేశ్వర రావు మీద మాత్రం టీఆర్ఎస్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం.

వనమా రాఘవ మీద కూడా టీఆర్ఎస్ వేటు వేసేందుకు జనాల నుంచి వ్యతిరేకత రావడమే కారణమని పలువురు భావిస్తున్నారు.లేకుంటే వనమా రాఘవను కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేది కాదని చర్చించుకుంటున్నారు. వనమా రాఘవ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

వామ్మో మరీ ఇంత ఘోరంగా ఉంటారా? అని సందేహం కలుగుతుంది.రాఘవ చేసిన ఆకృత్యాల వలన అనవసరంగా ఒక కుటుంబం బలైపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube