ఇంత దారుణ‌మా.. భార్యను అమ్మి ఫోన్ కొన్న భ‌ర్త

So Bad The Husband Who Sold His Wife And Bought A Phone

జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేశాడు.తన భార్య వయస్సులో అతనికంటే పెద్దది.

 So Bad The Husband Who Sold His Wife And Bought A Phone-TeluguStop.com

అయినా పెద్దలు పెండ్లికి నిరాకరించలేదు.పెళ్లి జరిగి నెల కూడా కాలేదు.

కానీ జల్సాలకు అలవాటు పడిన ఆ యువకుడు ఓ ప్లాన్ వేశాడు.డబ్బుల కోసం తన భార్యను ఓ ముసలాడికి అమ్మేశాడు.

 So Bad The Husband Who Sold His Wife And Bought A Phone-ఇంత దారుణ‌మా.. భార్యను అమ్మి ఫోన్ కొన్న భ‌ర్త-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తర్వాత గ్రామానికి వచ్చి తన భార్య తనను వదిలేసిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.కానీ పోలీసుల ఎంట్రీతో అతని సీన్ రివర్స్ అయింది.

ఇక ఇంకేముంది అసలు విషయాన్ని తేల్చిన పోలీసులు అతన్ని కటకటాల పాటు చేశారు.

ఒడిశాకు చెందిన 17 సంవత్సరాలు వ్యక్తి.26 సంవత్సరాలున్న యువతిని నెల క్రితం పెళ్లి చేసుకున్నాడు.జల్సాలకు అలవాటు పడిన అతడికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు.

దీంతో అతని మదిలో ఓ ఆలోచన వచ్చింది.దీంతో తన భార్యను అమ్మకానికి పెట్టాడు.

వచ్చిన డబ్బుతో జల్సాలు చేసి, స్మార్ట్ ఫోన్ కొనుక్కుని ఇంటికి వచ్చాడు.భార్య గురించి కుటుంబ సభ్యులు అడగితే.

ఆమె తనను వదిలేసిందని కట్టుకథ అల్లాడు.అతని మాటలను సదురు మహిళ కుటుంబంసభ్యులు నమ్మలేదు.

అనుమానంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు.

ఇందులో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి.కాల్ రికార్డుల ద్వారా సదురు మహిళ ఉన్న ప్లేస్‌ను గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను గ్రామానికి తీసుకొచ్చారు.

కేవలం డబ్బులు కోసం బారన్ గ్రామానికి చెందిన 55 సంవత్సరాలున్న ఓ ముసలివాడికి రూ.లక్ష 80 వేలకు ఆ యువకుడు తన భార్యను అమ్మేసినట్టు తేలింది.పూర్తి వివరాలను తెలుసుకున్న పోలీసులు సదురు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచారు.ఈ వార్త ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది.

#Bad Sold Phone #Phone #Sold

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube