అమెరికాపై ‘‘మంచు’’ పంజా.. స్తంభించిన జనజీవనం, న్యూయార్క్ సహా పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

అమెరికాపై మంచు తుఫాను పంజా విసురుతోంది.మంచు, తీవ్రమైన చలిగాలుల ధాటికి దేశ ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు వణుకుతున్నాయి.

 Snow Bomb Unleashes Blizzard In Us New York And Other States Declare Emergencies-TeluguStop.com

ప్రధానంగా న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియాలో ‘హిమ’ ప్రభావం తీవ్రంగా వుంది.ఈ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కొన్ని అడుగుల మేర మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.

రహదారులు, రైల్వే ట్రాకులపైకి భారీగా మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది.ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మంచు తుఫాను ధాటికి విద్యాస్థంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే మూసివేశారు.ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 4 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయినట్లుగా తెలుస్తోంది.

న్యూయార్క్ నగరంలోని మాన్‌హాటన్‌కు సమీపంలో ఉన్న లాంగ్‌ ఐలాండ్‌లో పది అంగుళాల (25 సెంటీమీటర్లు) మేర మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు.హిమపాతం ధాటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మసాచుసెట్స్‌లో దాదాపు 1.17 లక్షల ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి.మొత్తం మీద 70 మిలియన్ల మంది ప్రజలు మంచు తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తూర్పు తీరంలోని పట్టణ, నగర వాసులు రాత్రిపూట అత్యవసర ప్రయాణాలకు దూరంగా వుండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

బ్రూక్లిన్‌లోని కోబుల్ హిల్ పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోగా.

వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.కొందరు ధైర్యం చేసి బయటకొచ్చి.

ఒకరినొకరు ‘‘హ్యాపీ స్నో డే’’ అని చెప్పుకుంటున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.ఇప్పటి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, మేరీలాండ్, డెలావేర్, బోస్టన్, ఫిలడెల్పియాలలో అత్యవసర పరిస్ధితి విధించారు.

న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ శనివారం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.మంచు తుఫాను ప్రభావం ముగియలేదని, అత్యంత ప్రమాదకర దశలో వున్నామని హెచ్చరించారు.

ప్రభుత్వ సిబ్బంది రోడ్లపై పేరుకున్న మంచును తొలగిస్తున్నందున అనవసర ప్రయాణాలను విరమించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

Snow Bomb Unleashes Blizzard In US New York And Other States Declare Emergencies, New York, New Jersey, Virginia, Maryland, Delaware, Boston, Philadelphia, Manhattan, Massachusetts‌ - Telugu Boston, Delaware, Manhattan, Maryland, Massachusetts, Jersey, York, Philadelphia, Snowbomb, Virginia #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube