గురకను లైట్‌ తీసుకోకండి, కొత్త సర్వే చెబుతున్న భయంకర విషయాలు

మనుషులు గురుక పెట్టడం చాలా కామన్‌.దీన్ని కొందరు చాలా లైట్‌ తీసుకుంటారు.

 Snoring Is Harmful To Heart Health There Is A Solution Says American Doctors-TeluguStop.com

గురక అనేది వారి కంటే పక్కన ఉన్న వారికి చాలా ఇబ్బందులు కలిగిస్తుందని అంతా అనుకుంటారు.కాని అసలు విషయం ఏంటీ అంటే గురక అనేది పెట్టే వారికే ఎక్కువ నష్టం కలిగిస్తుందట.

తాజాగా అమెరికాకు చెందిన ఒక యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం గురక అనేది చిన్న సమస్య కాదని వారు నిర్ధారించారు.గురక వల్ల చాలా సమస్యలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు.

Telugu Heart Diseases, Harmfulheart, Telugu General, Telugu Telugu-

  గురుక సమస్య ఉన్న వారు గుండె జబ్బులకు ఎక్కువ గురయ్యే ప్రమాదం ఉంది.అనారోగ్య సమస్యలు ఉన్న వారు గురక పెడుతున్న సమయంలో గుండెకు అందాల్సిన ఆక్సీజన్‌ సరిగా అందక పోవడంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.గురుక సమస్యతో నిద్రలోనే ప్రాణాలు వదిలేసిన వారి సంఖ్య చాలా ఉందని, గురుక సమస్యతో గుండె జబ్బుతో పాటు అత్యంత ప్రమాదకరమైన పలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu Heart Diseases, Harmfulheart, Telugu General, Telugu Telugu-

  గురుకకు నివారణ కూడా ఉంది.గురుక రాకుండా పడుకునే సమయంలో నోట్లో ఒక పరికరం పెట్టుకోవాల్సి ఉంటుంది.ఆ పరికరం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదని అయితే దాన్ని వినియోగించాలంటే జనాలు కాస్త మొహమాట పడుతున్నారు అంటూ డాక్టర్లు అంటున్నారు.

ప్రాణాల మీదకు తీసుకు వచ్చే గురక నయం చేసుకునేందుకు ఆ పరికరం వాడటంలో తప్పులేదు అంటున్నారు.గురక సమస్య ప్రాణాపాయం అంటూ శాస్త్రవేత్తలు చెప్పిన తర్వాత ఇప్పుడైనా ఆ పరికరం వాడటం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

Telugu Heart Diseases, Harmfulheart, Telugu General, Telugu Telugu-

 

గురక సమస్యలు చాలా రకాలు ఉంటాయి.ఎక్కువ మంది నోరు తెరిచి గురక పెడుతూ ఉంటారు.అలాంటి వారికి ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి.నోరు తెరవడం వల్ల ఆక్సీజన్‌ తక్కువ వెళ్తుంది.తద్వారా గుండె పనితనంపై ప్రభావం చూపుతుంది.అది కాస్త చివరకు గుండె పోటు వరకు తీసుకు వచ్చి నిద్రలోనే ప్రాణాలు పోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు లేదా మీ వారు గుర్రు పెడుతున్నారా అయితే జాగ్రత్త పడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube