గురక పెట్టేవారికి కరోనా మరింత ప్రమాదం...!

కరోనా మహమ్మారి ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తుందో అందరికి తెలిసిందే.ఈ మహమ్మారి కి అగ్రరాజ్యం సైతం కుదేలు అయిపొయింది.

 Snorers Could Face Up To Three Times The Risk Of Dying Of Covid-19, Snoring, Cov-TeluguStop.com

అయితే ఇప్పటివరకు ఈ కరోనా వయసు మళ్ళిన వారికి,గుండె జబ్బులు,ఉబ్బసం,బీపీ షుగర్లు ఉన్న వారికి ప్రమాదకారి అంటూ నిపుణులు చెబుతున్న విషయం విదితమే.అయితే ఇప్పుడు తాజాగా ఈ వైరస్ అనేది గురకపెట్టే వారికి కూడా ప్రమాదకరం అంటూ ప్రముఖుల అధ్యయనం లో తేలింది.

ఈ కరోనా వైరస్‌ బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో గురకపెట్టి పడుకునే వాళ్లు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చి చెప్పారు.కరోనా వైరస్, నిద్రకు ఉన్న సంబంధంపై ఇప్పటివరకు 18 అధ్యయనాలు జరిపిన వార్‌విక్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తుంది.
అయితే గురక పెట్టే వారిలో కరోనా ప్రమాదం ఏంటి అన్న విషయం కి వస్తే గురక పెడుతూ నిద్రపోయేవారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా వెళ్ళకపోవడం తో వారికి ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ‘స్థూలకాయం, బీపీ, షుగర్ ఉన్నట్లయితే ఆ మూడే వారికి ప్రమాదం.

వాస్తవానికి ఈ మూడు అనారోగ్య సమస్యలు ఉన్నవారందరికి గురకపెట్టే అలవాటు వస్తుంది’ అని, వారికీ కరోనా మరింత ప్రమాదం అని పరిశోధకులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube