పెళ్ళి కాని సీనియర్ అగ్రహీరోపై కుర్ర హీరోయిన్ జోకులు   Sneha Ullal Makes Fun Of Salman Khan’s SINGLE Status     2016-12-28   23:59:54  IST  Raghu V

సల్మాన్ ఖాన్ వయసు 51 ఏళ్ళు. ఇప్పటికీ పెళ్ళి కాని విషయం తెలిసిందే. ఇంకో ఐదారేళ్ళు గడిస్తే, నిజంగానే అందరు ఆ హీరోని ముసలోడు అని పిలిచేస్తారు. ఇటివలే ట్వింకిల్ ఖన్నా అల్రెడి ముసలోడు అనేసింది. ఇప్పుడో కుర్ర హీరోయిన్ ఏకంగా సల్మాన్ ఒంటరి జీవితంపై జోకులేస్తోంది.

ఈ ఫోటో నిజానికి ఆమీర్ ఖాన్ దంగల్ పోస్టర్. దాంట్లో ఆమీర్ తన కూతుళ్ళతో ఇలా ఫోజు ఇస్తాడు. ఆ దంగల్ ని కాస్త, సింగల్ గా మార్చి, ఆమీర్ బాడికి సల్మాన్ ముఖాన్ని, అమ్మాయిల బాడికి ఐశ్వర్యరాయ్, కత్రీనా కైఫ్, స్నేహా ఉల్లాల్, జరీన్ ఖాన్ ముఖాలకి అతికించేసారు ఎవరో. ఆ ఫోటోని స్నెహా ఉల్లాల్ ఫన్ని అనే స్టేటస్ పెట్టి షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశామైంది.

సల్మాన్ ఐశ్వర్యరాయ్ తో, కత్రీనాతో ప్రేమాయణం నడపిన సంగతి తెలిసిందే. అలాగే స్నేహ ఉల్లాల్ తో, జరీన్ ఖాన్ తో కూడా మన భాయ్ మనసు కలిపాడని అనుకునేవారు. ఇప్పుడు స్నేహ ఆ ఫోటోని షేర్ చేసి ఓవైపు సల్మాన్ మీద జోకు వేయడమే కాదు, సల్మాన్ కి తనకి మధ్య అప్పట్లో నిజంగానే ఏదో నడిచిందనే సంకేతాలు వదిలింది.