బోయపాటి సినిమా కోసం మరోసారి స్నేహ

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

 Sneha Opposite Balakrishna In Boyapati Flick, Tollywood, Telugu Cinema, South Ci-TeluguStop.com

వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది కావడంతో దీని మీద నందమూరి అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.దానికి తగ్గట్లే బోయపాటి బాలకృష్ణని మరోసారి పవర్ ఫుల్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడు.

లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.త్వరలో మరల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఇందులో బాలకృష్ణ మొదటి సారి విభిన్నంగా అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు.దానికోసం ప్రత్యేకమైన మేకప్ కోసం నిపుణులని రంగంలోకి దించుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్స్ పాత్రల కోసం చాలా రోజులుగా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

బోయపాటి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఒకరు కొత్త హీరోయిన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చిన కూడా ప్రచారంలో మాత్రం మార్పు లేదు.శ్రీయ, నయనతార, మీనా లాంటి సీనియర్ హీరోయిన్స్ పేరు వినిపించాయి.

ఇప్పుడు ఈ లిస్ట్ లోకి స్నేహ పేరు వచ్చి చేరింది.ఇందులో సీనియర్ బాలకృష్ణ పాత్ర సరసన స్నేహ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న స్నేహ అయితే ఆ పాత్రకు బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో బోయపాటి ఆమె వైపు మొగ్గు చూపుతున్నాడని చెప్పుకుంటున్నారు.గతంలో బాలకృష్ణ, స్నేహ కాంబినేషన్ లో పాండురంగడు సినిమా వచ్చింది.

ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.ఇప్పుడు బోయపాటి సినిమా కోసం ఆమె పేరు గట్టిగా వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube