రెండవ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌  

Sneha Blessed With Baby Girl-sneha,sneha And Prasanna,sneha Love Marriage,sneha Marriage

ఫ్యామిలీ తరహా పాత్రల హీరోయిన్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు స్నేహా.ఈ అమ్మడు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Sneha Blessed With Baby Girl-Sneha Sneha And Prasanna Love Marriage

2012 సంవత్సరంలో ఈమె నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది.మొదట వీర పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో పెద్దలు మాట్లాడి ఒప్పించినట్లుగా వార్తలు వచ్చాయి.

వీరిద్దరు ప్రస్తుతం పలువురు సినీ జంటలకు ఆదర్శంగా ఉన్నారు.ఇప్పటికే వీరికి ఒక బాబు ఉన్నాడు.

ఆ బాబుకు ఇప్పుడు చెల్లి వచ్చింది.అంటే స్నేహా రెండవ సారి తల్లి అయ్యింది.ఈ విషయాన్ని ప్రసన్న సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.నేడు స్నేహా రెండవ సారి తల్లి అయ్యిందని, ఆమె ఒక అందమైన ఏంజిల్‌కు జన్మనిచ్చింది అంటూ ప్రసన్న పోస్ట్‌ చేశాడు.

ఆ పోస్ట్‌ను స్నేహా అభిమానులు మరియు తమిళ ప్రేక్షకులు తెగ వైరల్‌ చేశారు.స్నేహా అంటే ఇప్పటికి చాలా మందికి అభిమానం ఉంటుంది.

ఆ అభిమానంతోనే ఆమె ఏ షో చేసినా సినిమా చేసినా కూడా పిచ్చిగా చూస్తూనే ఉంటారు.

తాజా వార్తలు

Sneha Blessed With Baby Girl-sneha,sneha And Prasanna,sneha Love Marriage,sneha Marriage Related....