వామ్మో ఏకంగా వంటింట్లో ఇన్ని పాములా ..?

మామూలుగా మనం ఎక్కడైనా పాము చూస్తేనే భయపడతాం.అలాంటిది మన ఇంట్లోనే ఏకంగా పదుల సంఖ్యలో పాములు కనబడితే ఇంకేమైనా ఉందా…? ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు ఉంటే అక్కడే ప్రాణాలు విడిచేస్తారు కూడా.అయితే ఇలాంటి సంఘటన ఒకటి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ దగ్గరలోని సారంగాపూర్ లో చోటు చేసుకుంది.ఆ వ్యక్తి నివసిస్తున్న తన ఇంటి వంట గదిలో ఏకంగా 14 నాగుపాము పిల్లలను గుర్తించారు.

 Snakes In Kitchen Room , Snakes, Kitchen Room, Odisha, Sarangapure, 14 Child Sna-TeluguStop.com

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.సదరు వ్యక్తి కుటుంబంలో ఓ మనిషికి తన ఇంట్లో ఓ పెద్ద పాము తిరుగుతూ ఉండటం కనిపించింది.

అది తెలిసిన ఇంట్లో వారందరూ భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.ఆ తర్వాత ఎలాగోలాగా స్నేక్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపారు.

దీంతో స్నేక్ హెల్ప్ సిబ్బంది ఆ వ్యక్తి ఇంటికి చేరుకొని ఇంటి మొత్తాన్ని పరిశీలించారు.దీని పరిశీలిస్తున్న సమయంలో వారి ఇంట్లోని కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఓ చిన్న రంధ్రం వారి కంటపడింది.

అందులో ఏముందని చూడగా షాక్ గురయ్యే విషయం గమనించారు.

ఆ రంధ్రంలో ఏకంగా 14 నాగుపాము పిల్లలను స్నేక్ హెల్ప్ సిబ్బంది బయటకు తీశారు.

ఇది చూసి ఇంటి సభ్యులకు ఒక్కసారి గుండె ఆగినంత పని అయిపోయింది.ఇది అంతా మాకు తెలియకుండానే జరిగిపోయిందని వారు తెలియజేస్తున్నారు.సిలిండర్ పక్కన పాము ఎప్పుడు వచ్చి రంధ్రం చేసి అందులో అన్ని గుడ్లు ఎప్పుడు పెట్టిందో కూడా తెలియదని చెబుతున్నారు.అయితే పాము పిల్లలు దొరికాయి కానీ, అసలు పాము కనపడలేదు.

అసలు పాము కనపడక పోవటంతో చాలా సమయం వెతికిన తర్వాత స్నేక్ హెల్ప్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube