బాత్ టబ్ లో పాము... సోషల్ మీడియాలో వైరల్!

సాధారణంగా పాములను చెట్ల పొదలలో, అడవులలో, జంతు ప్రదర్శన శాల లో చూస్తూంటాం.అంత కాకుంటే రోడ్లపైన, వీధులలో చూస్తుంటాం.

 Snake Rescued From Bathroom Jet Watch Video Snake, Snake Rescued From Bathroom,-TeluguStop.com

కానీ ఏకంగా ఇంట్లో పైగా బాత్ రూం లో అందులో స్నానం చేసే టబ్బు లో పాము కనిపించిన సంఘటన ఎదురైంది.

ఆరిజోనాలో ఓ ప్రాంతం కు చెందిన యువతి… తన ఇంట్లో స్నానం చేయడానికి బాత్ టబ్ లో నిండుగా నీళ్లు నింపుకుంది.

స్నానం చేయడానికి సిద్ధం కాగా నీళ్లు వచ్చే పైపు నుండి కదలికలు కనిపించాయి.నీటి పైపు అదంతట అదే కదులుతుండటంతో….గమనించిన విషయాన్ని ఆ యువతి దానిని చూడటానికి దగ్గరికి వెళ్ళింది.పైపు అనుకున్న ఆమె పాముని చూసి షాక్ కు గురై… గుండె ఆగినంత పని అయ్యింది ఆ యువతికి.

ఆ పాముని అక్కడ నుంచి తరిమి వేయకుండా… వెంటనే పాములు పట్టే వ్యక్తికి‌ విషయాన్ని తెలిపింది.దీంతో ఆ పాములు పట్టే వ్యక్తి రంగంలోకి దిగి ఆ పైపులో ఉన్న పామును అదే స్థానం నుండి తను తెచ్చుకున్న గెలం లాంటి కర్ర సహాయంతో ఆ పామును బయటకు తీశాడు.

దానిని వెంటనే అటవీ ప్రాంతం కు తీసుకెళ్లి విడిచాడు.

ఇటీవలే ఇలాంటి ఘటన ఒకటి ఒరిస్సాలో చేపలు పట్టుకునే వ్యక్తికి ఎదురయింది.

తను చేపలు పట్టే సమయం లో తను వేసిన వల నుండి ఏకంగా రెండు పాములు వచ్చిన ఘటన చోటు చేసుకుంది.ఇలా పాములు చల్లని వాతావరణంలో ఎక్కువగా బయటకు రావడంతో….

ఇళ్లల్లోకి, నీటిలోకి దూరుతుంటాయి.కాబట్టి చాలా వరకు మీ చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఇటువంటి విష సర్పాల‌ నుండి జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube