షాక్‌ : ఆట మద్యలో గ్రౌండ్‌లోకి పాము ఎంట్రీ  

Snake Entry In Vijayawada Ranji Match Ground - Telugu Ranji Match, Ranji Match Start In Vijayawada, Stadium Security Alert And Catch The Snake

విజయవాడలో రంజీమ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి.విజయవాడ గ్రౌండ్‌లో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా పాము గ్రౌండ్‌లో ప్రత్యక్ష్యం అయ్యింది.

Snake Entry In Vijayawada Ranji Match Ground - Telugu Start Stadium Security Alert And Catch The

రంజీమ్యాచ్‌ ఆరంభం సమయంలో ఇలా జరగడంతో మ్యాచ్‌ నిర్వహకులు మ్యాచ్‌ ను కొద్ది సమయం నిలిపేశారు.మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఇలా పాము రావడంతో బీసీసీ ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

స్టేడియం నిర్వాహకులపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టేడియంలో ఇలాంటి జరగడం వల్ల ప్రేక్షకులు స్టేడియాలకు రావాలంటే భయపడతారని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకోవాలంటూ బీసీసీఐ ప్రతినిధులు విజయవాడ స్టేడియం నిర్వాహకులకు తెలియజేయడం జరిగింది.

ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.స్టేడియంలో పాములు వచ్చే వరకు నిర్వాహకులు ఏం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు తీసుకునే విషయంలో ఉన్న తెలివి ఆటగాళ్ల మరియు ప్రేక్షకుల భద్రత విషయంలో ఎందుకు చొరువ చూపడం లేదు అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు