మహిళ తలపై కాటేసిన పాము.. కాదని భర్తతో గొడవ!  

Snake Bites Woman\'s Forehead While sleeping, python bites, womans forehead, sleeping - Telugu Python Bites, Sleeping, Snake Bites Woman\\'s Forehead While Sleeping, Womans Forehead

మనుషులను అత్యంత భయానికి గురి చేసే జీవులలో పాము ఒకటి.పాము పేరు వినిపిస్తే చాలు మనలో చాలామంది గజగజా వణుకుతారు.

TeluguStop.com - Snake Bites Womans Forehead

ఇక పాము కాటేస్తే ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది.అయితే ఒక మహిళ మాత్రం పాము తలపై కాటు వేసినా పెద్దగా పట్టించుకోలేదు.

మొదట తాను పాము కాటు వేసిందని కల కన్నానని మహిళ భావించింది.ఆ తరువాత పాము కాటు వేసిన ప్రాంతంలో విపరీతంగా రక్తస్రావమైంది.

అదే సమయంలో ఆమె గదిలో పాము కనిపించింది.అయితే ఆ మహిళ ఏ మాత్రం కంగారు పడలేదు.తాపీగా భర్తను నిద్ర లేపి పామును పట్టుకోవాలని ఆదేశించింది.వినడానికి చిత్రవిచిత్రంగా ఉన్న ఈ ఘటన ఆస్ట్రేలియాలోని కూలాలింగాలో చోటు చేసుకుంది.

ఎమిలీ హిండ్స్ అనే మహిళ సోషల్ నెట్ బాల్ అనే పోటీలో చాలామందిని ఓడించి విజేతగా నిలిచింది.దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆ తరువాత వైన్ తాగి ఇంటికి వచ్చి నిద్రపోయింది.నిద్రపోయిన మహిళకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తలపై ఏదో పాకుతున్నట్టు అనిపించింది.నిద్ర లేచి చూడగా ఆ మహిళకు దిండు దగ్గర పాము కనిపించింది.వెంటనే భర్త జాసన్ కు పాము గురించి చెప్పగా అతను ఎంతో కష్టపడి పామును పట్టుకుని బయటకు విసిరేశాడు.

ఆ తరువాత భార్యాభర్త ప్రశాంతంగా నిద్రపోయారు.తరువాత రోజు సదరు మహిళ వైద్యుడి దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా చికిత్స చేయించుకుంది.
ఎమిలీ ఈ ఘటన గురించి స్పందిస్తూ తమ ఇంట్లోకి పాములు రావడం ఇదే తొలిసారి కాదని గతంలో కూడా అనేక సందర్భాల్లో పాములు వచ్చాయని పేర్కొంది.పాము విషపూరితం కాదని తెలిసి ప్రశాంతంగా నిద్ర పోయానని చెప్పింది.

#Python Bites #Sleeping #SnakeBites #Womans Forehead

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Snake Bites Womans Forehead Related Telugu News,Photos/Pics,Images..