ధైర్యం అంటే ఇలాగే ఉండాలేమో.. ఈ చిన్నారిని మెచ్చుకోవాల్సిందే..!

సాధార‌ణంగా మ‌నం పామును చూస్తేనే ఆమ‌డ దూరం ప‌రుగెత్తుతాం.ఎందుకంటే అది ఎక్క‌డ మ‌న‌ల్ని క‌రుస్తుందేమో అన్న భ‌యంతో.

 Snake Bite Boy Chased And Killed The Bitten Snake-TeluguStop.com

కానీ కొంద‌రు మాత్రం చాలా ధైర్యంగా ఏకంగా పామును ప‌ట్టుకుని మ‌రీ ఆడిస్తుంటారు.ఇక అలాంటి ఘ‌ట‌న‌లు చూశాక మ‌న‌కు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.అయితే పామును ప‌ట్టుకుంది మాత్రం పెద్ద వయ‌స్సు వారు కాదు.

 Snake Bite Boy Chased And Killed The Bitten Snake-ధైర్యం అంటే ఇలాగే ఉండాలేమో.. ఈ చిన్నారిని మెచ్చుకోవాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ బుడ్డోడు.అవునండి మీరు విన్న‌ది నిజ‌మే.

ఓ బుడ్డోడు ఏకంగా పామును ప‌ట్టుకుని ప‌రిగెత్తించి మ‌రీ చంపేశాడు.

అయితే ఆ కుర్రాడు ఏకంగా ఆ పామును చంప‌డ‌మే కాకుండా దాన్ని కవర్లో వేసుకుని మ‌రీ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు.

దాన్ని చూపించి ట్రీట్ మెంట్ ఇవ్వాల‌ని కోరాడు.అయితే ఇదంతా జ‌రిగింది మ‌న ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడులో.త‌మిళ‌లోని కాంచీపురం ద‌గ్గ‌ర్లో ఉంటున్న రాము కొడుకు దర్షిత్ స్థానికంగా ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతూ ఆడుకుంటున్నాడు.అయితే రీసెంట్ గా ఆ చిన్నారి తన అమ్మమ్మ పొలంలోకి వెళ్లి ఆడుకుంటూ ఉండ‌గా ఒక పాము వ‌చ్చి కరిచింది.

దీంతో ఏంటా అది అని వెతికాడు ఆ బుడ్డోడు.పెంజ‌ర‌గా గుర్తించి పొలంలో పాము వెంటపడి మ‌రీ దాన్ని కొట్టి చంపేశాడు.

ఇక అక్క‌డితో దాన్ని విడిచి పెట్ట‌కుండా పామును తీసుకుని ఇంటికి వెళ్లాడు.ఇక చిన్నారి త‌ల్లిదండ్రులు ఆ పామును తీసుకుని చిన్నారిని ద‌గ్గ‌ర్లోని కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.

కాగా ఆ చిన్నారిలో మాత్రం ఎలాంటి మార్పు రాక‌పోవ‌డంతో డాక్ట‌ర్లు కూడా రెండురోజులు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి ఆ త‌ర్వాత డిశ్చార్జిచేశారు.కానీ ఇంటికి వెల్లిన త‌ర్వాత అనూహ్యంగా బాలుడి కాలు వాచిపోవ‌డంతో వెంట‌నే చెన్నై ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు.

అక్క‌డ రెండు రోజుల త‌ర్వాత పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి పంపించేశారు.మొత్తానికి ఈ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే క‌దా.

.

#Tamil Nadu #Snake #Dare Child #Snake Bite #KanchipuramGovt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు