జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు ట్రాఫిక్ జాం చేసిన నాగుపాము.. !

ఇదివరకే అడవులను వదిలేసిన కౄరమృగాల గురించిన వార్తలు రోజు వింటున్నాం.కాగా తాజాగా చెట్లను, పుట్లను వదిలేసిన పాముల గురించి ఇప్పుడు వింటే.

 Snake Appears On Road At Ghmc Office In Hyderabad-TeluguStop.com

ఎండ వేడి వల్ల కావచ్చూ, లేదా పాములు ఉండడానికి ఏర్పరచుకున్న ప్రదేశాల్లో ఉన్న పుట్టలను, గుట్టలను తవ్వి నివాసాలను ఏర్పరచుకుంటున్న మనుషుల వల్ల కావచ్చూ గానీ మొత్తానికి పాములు కూడా రోడ్లు ఎక్కుతున్నాయి.

ఇలాగే ఆలోచించిన ఒక పాము ఏకంగా తన బాధను జీహెచ్ఎంసీ కి చెప్పుకుందామని బయలుదేరిందట, కానీ మనుషుల కంట పడే సరికి అక్కడే ఆగిపోయి పడగవిప్పి బుసలు కొడుతుందట.

 Snake Appears On Road At Ghmc Office In Hyderabad-జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు ట్రాఫిక్ జాం చేసిన నాగుపాము.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వివరం తెలుసుకుంటే.రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో నాగుపాము క‌ల‌కలం సృష్టించింది.ఏకంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు ఆదివారం ఉద‌యం నాగుపాము ప్ర‌త్య‌క్ష‌మైంది.

కాగా నడిరోడ్డు ప‌క్క‌నే నాగుపాము పడగవిప్పి కనిపించ‌డంతో వాహ‌నదారులు భ‌యంతో ఆగిపోయారు.

దాంతో కాసేపు ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.చివ‌రికి అక్క‌డున్న‌ ట్రాఫిక్ పోలీసులు స్నేక్ సొసైటీ వారికి స‌మాచారం అందించ‌డంతో వారు వ‌చ్చి పామును తీసుకెళ్లి సుర‌క్షిత ప్రాంతంలో వ‌దిలేశారట.

#Ghmc Office #Hyderabad #Road #Snake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు