నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది.ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ గుర్తించారు.
దాంతో ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి,ఇతర వాహనాలను ఢీకొట్టారు.
ఈ క్రమంలో కారు వదిలేసి స్మగ్లర్లంతా చెరువులోకి దూకారు.ఈ విషయాన్ని ట్రాఫిక్ ఎస్‌ఐ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు.
చెరువు చుట్టూ పోలీసులను మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.