కేంద్రమంత్రిపై రహస్య చిత్రీకరణ

గోవాలో మహిళలను రహస్యంగా కెమెరాలతో వాటిని చూసుకోవడంలో తెగ ఆనందించడం అనేది చాలా కాలంగా జరుగుతున్న తతంగం.అయితే ఎన్నాళ్లని చూస్తారు.

 Smriti Irani Spots Cctv In Goa’s Fabindia Trial Room-TeluguStop.com

ఏదో రోజు ఆట కట్టు కావడం అనేది నిజం .అదే నేడు జరిగింది .ఈమధ్య వేసవిలో గోవా అందాలు ఆస్వాదించడానికి ఒకింత సేద తీర్చుకోవడానికి కి విచ్చేసారు కేంద్ర మంత్రి స్మృతిఇరానీ.పనాజి దగ్గర్లోని ప్రముఖ బ్రాండెడ్ దుస్తుల షోరూమ్‌లో ఆమెకు భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది.

దుస్తులు మార్చుకునే చిన్నగదిలో రహస్య కెమెరాను చూసి కేంద్ర మంత్రి షాక్‌కు గురయ్యారు.వెంటనే స్థానిక బిజెపి ఎమ్మెల్యే మైకేల్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు అప్పటికే ఆమె సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గోవాలోని బిజెపి ప్రభుత్వం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.షోరూమ్‌ను సీజ్ చేసి సిసి కెమెరాలు, కంప్యూటర్‌ను, హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకుని, షోరూం సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు.

పనాజి (నార్త్) పోలీసు ఉన్నతదికార్లు విచారణలో తల మునకలయ్యారు .కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పనాజికి 20 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ఫ్యాబ్‌ఇండియా షోరూమ్‌లో దుస్తులు కొనడానికిగోవా వచ్చినప్పుడు వెడుతుంటారు.ఈసారి ఇలాంటి ఈ అనుభవం ఎదురైంది.షోరూమ్‌లో దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఇలా గోడలో రహస్యంగా ఏర్పాటు చేసిన నిఘా కెమెరా కనిపించడం ఆమె చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు .నాలుగు నెలలుగా కెమెరా పని చేస్తోందాని తెలుసుకున్నారు .కెమెరాలోని దృశ్యాలు షోరూమ్ మేనేజర్ ఆఫీసులో ఉన్న ఓ కంప్యూటర్‌లో రికార్డు అవుతున్నాయని తెలిసింది .ఈ సరికే ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకున్న చాలామంది దృశ్యాలు ఈ కంప్యూటర్‌లో రికార్డు అయి ఉన్నాయని వారు తెలిపారు .స్మృతి ఇరానీకి ముందు ట్రయల్ రూమ్‌లోకి వెళ్లిన ఓ మహిళ స్టేట్‌మెంట్‌తోపాటుగా ఒక బాధితురాలిగా స్మృతి ఇరానీ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసినట్టు పోలీసులు చెప్పారు.దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుందని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ విలేఖరులకు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube