వర్కింగ్ మదర్ కష్టాలు ఇవే అంటున్న స్మృతి ఇరానీ!

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన భావాలను అభిమానులతో పంచుకుంటారు.ఆ విధంగా పోస్టులను పెట్టడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ద్వారా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు.

 Smriti Irani,smriti Irani Instagram Post,struggles Of Working Mom,minister Smrit-TeluguStop.com

స్మృతి ఇరానీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి కావడంతో, వృత్తి పరంగా ఎంతో బిజీ జీవితం గడుపుతూ, మరో వైపు తన కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంటారు.

కేంద్రమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత తను చేస్తున్న కార్యకలాపాలతో పాటు, లైఫ్ లో తన వ్యక్తిగత విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంటారు.

ఇందులో భాగంగానే తాజాగా ఓ సెల్ఫీ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడంతో పాటు, ఒక వర్కింగ్ మదర్ కష్టాలు ఎలా ఉంటాయో వివరించారు.స్మృతికి భర్త జుబిన్‌ ఇరానీ, ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.

స్మృతి ఇరానీ చేసిన ఈ పోస్టు ద్వారా తమ కుటుంబాన్ని, పిల్లలను, వర్క్ మీటింగ్స్ మధ్య జీవితాన్ని ఎలా సమన్వయం చేస్తున్నారో తెలియజేశారు.

Telugu Smriti Irani, Selfie, Smritiirani, Struggles Mom, Ministrychild, Zubin Ir

కరోనా కారణం వల్ల ఇంటి నుంచే పని చేసే ఎంతోమంది అమ్మలకు ఆన్ లైన్ సమావేశాలలో పాల్గొంటూ, మరోవైపు ఇంటి బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొనడమే కాకుండా, దీనికి వర్కింగ్ మామ్స్ అనే హ్యష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు.స్మృతి ఇరానీ ఇలా పోస్ట్ చేయడానికి గల కారణం ఇంట్లో నుంచి వర్చువల్ మీటింగ్స్ కు హాజరవుతున్న మంత్రికి తన పిల్లల అరవడం వల్ల అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.అయితే ఈ పోస్ట్ పై స్పందించిన పలువురు నేతలు స్మృతి ఇరానీ మల్టీ టాస్కర్ అని ప్రశంసిస్తున్నారు.

తాజాగా మంత్రి ట్యూస్‌డే (మంగళవారం ) అంటూ యాంగ్రీ లుక్స్‌తో మరోసారి అలరించిన విషయం తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube