విద్య కాషాయీకరణా?....ఉత్తిదే...!

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతిపక్షాలు ఒక బలమైన ఆరోపణ అదేపనిగా చేస్తున్నాయి.ఏమిటది? ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని.చరిత్ర పుస్తకాలను మారుస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర హిందూత్వ సంస్థల భావజాలం ప్రవేశపెడుతోందని ఆరోపిస్తున్నాయి.ముఖ్యంగా చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని అంటున్నారు.దీనిపై స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ‘అబ్బే…ఇదంతా ఉత్తిదే’ అని తేల్చేశారు.అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, విద్యా కాషాయీకరణ ప్రసక్తే లేదన్నారు.‘నేనెప్పుడూ విద్యార్థులను మీ మతమేదీ అని అడగలేదు’ అని అన్నారు.మతం ప్రాతిపదికగా విద్యావిధానం ఉండబోదన్నారు.

 Smriti Irani Denies Saffronization Of Education-TeluguStop.com

గుజరాత్‌ కేంద్ర విశ్వవిద్యాలయానికి ముస్లింను వీసీగా నియమించడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.కాని పాఠ్యపుస్తకాల తయారీలో హిందూత్వవాదులకే ప్రాధాన్యం ఇచ్చారని విపక్షాలు అంటున్నాయి.

చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలం నుంచి వున్నాయి.భాజపా నాయకుల ప్రకటనలు కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube