కేంద్రమంత్రి మిస్సింగ్ అంటూ వెలిసిన పోస్టర్, కలకలం  

Smriti Irani Bjp Congress - Telugu Amethi Constituency, Congress, Raebareli Constituency, Rahul Gandhi, Smriti Irani, Smriti Irani Missing Poster, Sonia Gandhi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మిస్సింగ్ అంటూ ఒక పోస్టర్ కలకలం సృష్టించింది.కాంగ్రెస్ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్ లోని అమేధీ నియోజకవర్గం లో గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఎంపీ గా ఎన్నికైన విషయం తెలిసిందే.

 Smriti Irani Bjp Congress

గత 40 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ గెలుస్తూ రాగా,గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ కంచుకోట లో పాగా వేశారు.అయితే ఆమె నియోజకవర్గమైన అమేథీలో ఓ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఇప్పుడు కలకలం రేపుతోంది.

అందులో స్మృతి ఇరానీ ఫొటోతోపాటూ మా ఎంపీ ఎమైపోయారో, ఎక్కడున్నారో అంటూ కొంత మేటర్ ఉంది.ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటానని మాటిచ్చిన మంత్రి రెండేళ్లలో రెండు రోజుల్లో కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉన్నారని పోస్టర్‌లో వివరాలున్నాయి.

కేంద్రమంత్రి మిస్సింగ్ అంటూ వెలిసిన పోస్టర్, కలకలం-Political-Telugu Tollywood Photo Image

ఇలాంటి పోస్టర్లను అక్కడి కాంగ్రెస్ మహిళా విభాగం విడుదల చేసింది.ఈ విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో కౌంటర్ ఇచ్చారు.8 నెలల్లో పది సార్లు అమేథీకి వెళ్లాననీ… 14 రోజులు అక్కడ ఉన్నాననీ 44 ఏళ్ల స్మృతీ ఇరానీ తెలిపారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీకి ఎన్నిసార్లు వెళ్లారో చెప్పాలంటూ ఈ సందర్భంగా స్మృతి డిమాండ్ చేశారు.

యూపీలోని అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట అన్న విషయం తెలిసిందే.గత 40 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది.మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకూ అది రాహుల్ గాంధీ నియోజకవర్గంగా ఉంది.అక్కడ 2019లో స్మృతి ఇరానీ ఎంపీగా గెలవడంతో… సీన్ మారింది.

ఆ నియోజకవర్గం బీజేపీ వశమైంది.కరోనా లాక్‌డౌన్ కాలంలో అమేథీ కోసం తాను ఏమేం పనులు చేసిందీ చెప్పిన ఇరానీ చాలా మంది వలస కూలీలు అమేథీకి వచ్చేందుకు సాయపడ్డానని,అలానే ప్రధాని పధకాల ద్వారా రైతులకు మేలు జరిగేలా చేశానంటూ ఆమె స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Smriti Irani Bjp Congress Related Telugu News,Photos/Pics,Images..