నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదంటున్న టాలీవుడ్  సింగర్.. కానీ ...

తెలుగులో తన ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు పలు టాలీవుడ్ చిత్రాల్లోని పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న  “పాప్ సింగర్ స్మిత” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.ఈ మధ్య కాలంలో  స్మిత  కొన్ని సంఘటనల గురించి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

 Smitha, Tollywood Pop Singer, Tollywood, Political Entry, Andhra Pradesh Politi-TeluguStop.com

అయితే  తాజాగా సింగర్ స్మిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఉద్దేశించి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేసింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ కుల ప్రస్తావన తెస్తూ సింగర్ స్మిత పై పలు అనుచిత కామెంట్లు చేస్తున్నారు.

దీంతో తాజాగా ఈ విషయంపై సింగర్ స్మిత స్పందించింది.ఇందులో భాగంగా తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, అంతేగాక తాను ఎవరు ఎక్కువగా ప్రజలకు మంచి చేస్తే వారికి తన మద్దతు తెలియజేస్తున్నానని అంతే తప్ప ప్రత్యేకంగా ఏ పార్టీకి తన మద్దతు తెలియజేయనని చెప్పుకొచ్చింది.

అంతేగాక తాను ఎప్పుడూ కూడా కుల రాజకీయాలను ప్రోత్సహించనని, అలాగే తన కులం గురించి కూడా తనకి పెద్దగా పట్టింపు లేదని తెలిపింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ సింగర్ స్మిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలియచేస్తున్నారు.

అంతేకాక ప్రజలు కూడా రాజకీయ నాయకులు చేసిన మంచి, చెడులని చూసి ఓట్లు వేస్తారని కులాన్ని బట్టి ఎవరు ఓట్లు వేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఎన్నికలలో సింగర్ స్మిత స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కి తన మద్దతును తెలియజేసింది.

కానీ ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube