ఆఫీస్ లో భరించలేని వాసన,తీరా ఏంటా అని చూస్తే....

ఆఫీస్ లో భరించలేని వాసన రావడం తో ఆరుగురు ఆసుపత్రి పాలు కూడా అయ్యారు.ఇంతకీ అసలు ఆ వాసన ఏంటి అది ఎక్కడ నుంచి వచ్చింది అన్న దానిపై వెతుకగా అది ఒక ఫ్రూట్ వాసన అని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు.

 Smelly Durian Fruit Sends 6 People To Hospital, Causes Evacuation Of Post Office-TeluguStop.com

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే జర్మనీలో.జర్మనీ లోని ష్వీన్‌ఫర్ట్అ లోని ఒక పోస్టాఫీస్ లో చోటుచేసుకుంది.

రోజూ ఏవో ఒక లెటర్లు, పార్సిళ్లు వస్తుంటాయి.ఈ క్రమంలోనే అక్కడ కు ఒక పెద్ద పార్మిల్ కూడా వచ్చింది.

అయితే డెలివరీ చేయడానికి ముందు ఆ పార్సిల్ ను ఆఫీస్ లోనే ఉంచారు.అయితే ఆ పార్సిల్ వచ్చిన తరువాతే అక్కడ అసలు సమస్య మొదలైంది.

నిదానంగా ఒక రకమైన వాసన రావడం మొదలైంది.అందరి ముక్కులకూ కరోనా మాస్కులు ఉన్నా.

ఆ వాసన ఆగలేదు.అంతకంతకూ అది పెరిగిపోతుంటే ఆఫీసులో అమ్మో ఎదో గ్యాస్ లీకైనట్లుంది అంటూ కొందరు భావించగా,కొంతమందికి అయితే అప్పటికే దగ్గు, కడుపులో తిప్పుతున్నట్లు ఉండడం తో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి పరుగులు పెట్టారు.

ఇలా ఆరుగురు వెళ్లిపోయారు.మిగతావాళ్లు మనమూ వెళ్లాలి అనుకున్నారు కానీ, అందరూ వెళ్లిపోతే ఎలా అని మరికొందరు అనుకోని ముందు ఆఫీస్ లోంచీ బయటకు వెళ్లిపోదాం అని అందరూ బయటకు వెళ్లిపోయారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం తో కొన్ని క్షణాలకే అక్కడకు వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది… ఏం జరిగింది అని అడిగితే… “సార్… గ్యాస్ లీకైనట్లుంది.ఆఫీస్‌లో గ్యాస్ వాసన వస్తోంది.భరించలేకపోతున్నాం” అన్నారు.“మరి మేమూ మనుషులమేగా… మేం కూడా ఆ గ్యాస్ పీల్చకూడదు” అంటూ పోలీసులు… ఆస్పత్రి నుంచి ప్రత్యేక ఎయిర్ ఫేస్ షీల్డుల వంటివి తెప్పించారు.ఆ తర్వాత పోస్టాఫీస్ బయట, లోపలా అంతా వెతికినా… ఎక్కడా ఏ గ్యాసూ లీకవుతున్నట్లు కనిపించలేదు.దీనితో అసలు ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుంది అని ముఖానికి ఉన్న షీల్డ్ లు తీసి వాసన చూశారు.

ఒక్కసారిగా వచ్చిన వాసన పీల్చిన పోలీసులు ఛీ ఏంటి ఈ వాసన ఇంత చండాలంగా ఉంది అనుకుంటూ బయటకు వెళ్తుంటే, ఓ పార్శిల్ దగ్గరకు రాగానే వాసన మరింత ఎక్కువైంది.దాంతో డౌట్ వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను ఓపెన్ చేసి చూడగా భరించలేని వాసన వస్తూ అందులో ఒక ఫ్రూట్ ఉంది.

ఇంతకీ ఆ ఫ్రూట్ ఏంటంటే డ్యురియన్ పండు (DURIAN fruit).అదే ఆ వాసనకు కారణం అని అర్థమైంది.ఈ విషయం తెలియగానే… ఓ ఆసియా వ్యక్తి దాన్ని గుర్తించి ఆ పండు అలాంటి వాసనే వస్తుందనీ కానీ తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుందని చెప్పాడు.దానితో అది తినే ఫ్రూట్ అని అందరికీ అర్ధం అయ్యింది.

కానీ దాని వాసన విషయానికి వస్తే మాత్రం కుళ్లిపోయిన ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది.ఆ వాసన పీల్చితే వికారం రావడం సహజం.అందుకే ఈ పండును చాలా హోటళ్లు బ్యాన్ చేశాయి.దీని రుచి బాగుండటంతో… తినేటప్పుడు నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే లాంటి లక్షణం వల్ల తూర్పు, ఆగ్నేయ ఆసియాలో దీన్ని ఇష్టంగా తింటారట.

అయితే అవి కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే పండుతాయి కాబట్టే ఎవరో దాన్ని డెలివరీ చేయించుకొని ఉంటారని, అలా ఆ పండు పోస్టాఫీస్ కు రావడం తో ఆరుగురు అస్వస్తతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న మిగిలిన పోస్టాఫీస్ సిబ్బంది,పోలీసులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube