స్మార్ట్ ఫోన్స్‌తో పిల్ల‌ల‌కు దెబ్బే…ఇలా     2017-09-23   02:24:57  IST  Raghu V

-

-

సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయ్యిపోయింది..కాలు లేకపోయినా బ్రతకగలం..కానీ సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేము అనే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఉన్న సమాజం. ఆధునికత పెరిగే కొద్దీ సాంకేతిక పరికరాల వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్లు, సెల్ ఫోన్లు లేని ప్రపంచాన్ని ఊహించలేం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది.

కానీ ఈ అలవాటు వెనుకాల దాగివున్న మరొక భయంకరమైన విషయం ఏమిటంటే…సెల్ ఫోన్ల ద్వారా మైక్రోవేవ్స్ అనే సూక్ష్మతరంగాలు అతి సులభంగా శరీరంలోకి చొచ్చుకుపోగలుగుతాయి. ఇలా శరీరంలో నుంచి ప్రయాణించే మైక్రోవేవ్స్ ద్వారా శరీరకణాల్లో కొన్ని అవాంఛనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని.. అవి భవిష్యత్తులో మనకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే పిల్లలు పెద్దలు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లన పరిమితంగా ఉపయోగించాలి. స్మార్ట్ ఫోన్లను పడకగదిలో ఉంచకండి. స్మార్ట్ ఫోన్స్ ని పిల్లలకి ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్ ఎందుకంటే.. సెల్ ఫోన్ వలన పిల్లల మెదడుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అందుకే.గేమ్స్ కోసం ఫోన్లను అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణు హెచ్చరిస్తున్నారు