అలాంటి వారే ఎక్కువ‌గా టీవీ చూస్తార‌ట‌.. ప‌రిశోధ‌న‌లో షాకింగ్ విష‌యాలు..!!  

what is the cause of watching too much tv, Watching TV, Smart Tv, Lock DOwn, Heart Diseas, Health Problems - Telugu Health Problems, Heart Diseas, Lock Down, Smart Tv, Watching Tv

టీవీ.నేటి కాలంలో ప్ర‌తి ఇంట్లోనూ ఇవి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.అయితే గ‌‌తంలో అయితే వీధికో టీవీ మాత్రమే ఉండేది.అది కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి.కానీ, ఇప్పుడు ఇంటికో స్మార్ట్‌టీవీ ఉంటుంది.దీంతో పెద్ద‌ల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు టీవీల‌కు తెగ అతుక్కుపోతున్నారు.

 Smart Tv Lock Down Heart Diseas

ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ కాలంలో ఇలాంటి వారి సంఖ్య మ‌రీ పెరిగిపోయింది.లాక్‌డౌన్‌లో ఏం చేయాలో తెలియ‌క గంట‌లు తర‌బ‌డి టీవీలు చూసేస్తున్నారు.

కానీ, ఇలా ఎక్కువసేపు టీవీ చూడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా మధుమేహం, గుండెజబ్బులు వంటి భ‌యంక‌ర స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ ఎక్కువ‌ని ఇప్ప‌టికే నిపుణులు తేల్చి చెప్పారు.

అలాంటి వారే ఎక్కువ‌గా టీవీ చూస్తార‌ట‌.. ప‌రిశోధ‌న‌లో షాకింగ్ విష‌యాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే వాస్త‌వానికి కాల‌క్షేపం కోసం టీవీ చూసే వారు కొంద‌రుంటే.మ‌రికొంద‌రు మాత్రం రోజంతా టీవీనే ప‌ట్టుకుని వేలాడుతుంటారు.ఇలాంటి వారిపై తాజాగా జ‌రిపిన ప‌రిశోధ‌నలో కొన్ని షాకింగ్‌ విషయాలు బ‌య‌ట ప‌డ్డాయి.

అవేంటంటే.వివిధ రకాల కోరికలు మ‌రియు సమస్యలు ఉండి అవి తీరకపోతే.ఆ అసంతృప్తితో ఉన్నవారే ఎక్కువగా టీవీ చూస్తుంటారని చెబుతున్నారు ప‌రిశోధ‌క‌లు.

సంతోషంగా ఉండేవారుతో పోలిస్తే.అసంతృప్తిపరులు ముప్పై శాతం అధికంగా టీవీ చూసేందుకు ఆసక్తి చూపిస్తారని ప‌రిశోధ‌న‌లో తేలింది.

అయితే ఇలాంటి వారికి తాత్కాలికంగా ప్ర‌శాంత‌త దొరికినా.మ‌న్ముందు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణ‌లు హెచ్చిరి‌స్తున్నారు.

అందుకే టీవీ చూడ‌డం త‌గ్గించుకోవాల‌ని సూచిస్తున్నారు.

#Health Problems #Heart Diseas #Smart Tv #Watching TV #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Smart Tv Lock Down Heart Diseas Related Telugu News,Photos/Pics,Images..