ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా అయితే జాగ్రత్త!

స్మార్ట్ టీవీ ఏంటి జాగ్రత్త ఏంటి అని అనుకుంటున్నారా.ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇళ్లల్లో స్మార్ట్ టీవీ కోసం ఆరాట పడుతున్నారు.

 Smart Tv Leaks Newly Married Couple Personal Videos-TeluguStop.com

అతి సామాన్యుల నుంచి గొప్ప గొప్ప వారు సైతం తమ ఇంటిలో స్మార్ట్ టీవీ ఉంటె చాలు అంటూ తెగ స్మార్ట్ టీవీలను కొనేస్తున్నారు.అయితే ఈ స్మార్ట్ టీవీ ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి అన్న విషయం ఈ తాజా ఉదంతం ఉదాహరణ గా నిలుస్తుంది.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన ఒక నూతనంగా పెళ్ళైన జంట పడక గదిలో స్మార్ట్ టీవీ ఉంది.దానికి వైఫై కనెక్షన్ అన్ని హంగులు ఉన్నాయి.

ఇంకేముంది కొత్తగా పెళ్ళైన జంట కావడం తో తమ స్మార్ట్ టీవీ లో ఇంటెర్నెట్ ఆన్ చేసి పోర్న్ వీడియోలు చూస్తూ శృంగారంలో పాల్గొంటున్నారు.అయితే ఆ సమయంలో వీడియోల కోసం సెర్చ్ చేస్తుండగా వారి పడకగదికి సంబందించి వీడియో బయటపడింది అంతే ఇక ఏమి జరిగిందో వారికి అర్ధం కాలేదు సరికదా ఒక్కసారిగా బిత్తరపోయి ఆ రూమ్ మొత్తం వెతికారు.

ఏమైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా అని చూస్తే ఎక్కడా ఏమీ కనిపించలేదు.అయితే ఈ ఘటనను బయటకు కూడా చెప్పుకోలేక పాపం సైలెంట్ గా సైబర్ నిపుణుడిని సంప్రదించారు.

అయితే వారు కూడా వీరి పడకగది అంతా వెతికి కెమెరాలు ఎక్కడాలేవని నిర్ధారించుకున్నారు.అయితే అప్పుడు ఒక విషయం వారికి అర్ధం అయ్యింది.

ఈ విధంగా వారి వీడియో అంతర్జాలం లో రావడానికి కారణం వారి పడకగదిలో ఉన్న స్మార్ట్ టీవీ యే నని.అవును అత్యాధునిక ఈ స్మార్ట్ టీవీకి ఒక ఇన్ బిల్డ్ కెమెరా ఉంది.

ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా అయి

దానికి వైఫై కనెక్షన్ కూడా ఉండడం తో ఒక హ్యాకర్ ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ టీవీని హ్యాక్ చేసి కెమెరాతో వీరి పడకగది వీడియోను తీసి పోర్న్ సైట్ కు అమ్ముకున్నాడట.సైబర్ నిపుణులు రంగంలోకి దిగాక అసలు విషయం బయటపడింది.అయితే ఇలా ఎన్ని సార్లు ఆ హ్యాకర్ తమ వీడియోలను అమ్ముకున్నాడో తెలియదు కానీ, ఆన్ లైన్లో తమ వీడియోను తీయించడానికి ఇప్పుడా జంట నానా కష్టాలు పడుతుందట.పాపం ఇలా జరిగింది అని పోలీసులకు చెబితే పరువు పోతుంది అని సైబర్ నిపుణుల ద్వారా ఈ తతంగం కానిచ్చేస్తుందట.

మరి అందుకే స్మార్ట్ టీవీ ల కోసం ఆరాటపడకండి, గుట్టుగా ఉండాల్సిన సంసారం ఈ విధంగా నెట్ పాలిట పడుతుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube