సైడ్‌ కాలువలో నుంచి బురద తీయడానికి స్మార్ట్ టెక్నిక్.. వీడియో వైరల్!

సాధారణంగా సైడు కాలువలలో నీరు ప్రవహిస్తున్న కొద్ది బురద కూడా చేరుకుంటుంది.ఆ కాలవలో ఓపెన్ టైపు ఉంటే వాటిని శుభ్రం చేయడం చాలా ఈజీ.

 Smart Technique To Remove Mud From The Side Canal Video Viral , Mud, Side Fall,-TeluguStop.com

కానీ క్లోజ్ అయి ఉంటే వాటిలోని బురద బయటకు వెలికి తీయడం చాలా కష్టం.అయితే ఈ కష్టమైన పనిని చాలా సులభంగా చేసి చూపించారు కొందరు.

ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగించి బురదతో పూర్తిగా నిండిపోయిన ఒక సైడ్ కాలవను క్లీన్ చేశారు.దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ వైరల్ హాగ్ షేర్ చేసింది.

దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్ ఏ వండర్‌ఫుల్ టెక్నిక్, ఇలా స్మార్ట్ గా ఆలోచిస్తే ఏదైనా సులభమే అని కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకి ఒక ట్రాక్టర్, దానికి వెనుక చైన్ తాడుతో కట్టిన ఒక టైర్‌ చూడవచ్చు.ఆ ట్రాక్టర్ ఈ టైర్‌ను లాక్కెళుతూ ముందుకు వెళ్ళింది.

ఈ చైన్‌ను మొదటగా సైడ్ కాలవ లోపల నుంచి బయటికి తీశారు.ఆపై ఒక టైర్‌కి, ట్రాక్టర్ వెనుక సైడ్‌లో చైన్ కనెక్ట్ చేశారు.

దాంతో ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ టైర్ అనేది సైడ్ కాలువ లోపల నుంచి వెళ్లడం మొదలెట్టింది.ట్రాక్టర్ ఫోర్స్ కి టైర్ కాలువలో ఉన్న బురద అంతా బయటికి నెట్టుకు వచ్చింది.దాంతో ఆ కాలువ క్లీన్ అయిపోయింది.

“ఈ తెలివైన కల్వర్ట్ క్లీనింగ్ మెథడ్ చూడటానికి వింతగా, సంతృప్తినిచ్చేలా ఉంది” అని వైరల్ హాగ్ పేజీ ఒక క్యాప్షన్ జత చేసింది.ఈ వీడియో చూసిన అద్భుతమని కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోకి 10 వేలకు పైగా వ్యూస్, రెండు వేలకు పైగా లైక్స్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube