అక్కడ ఉచితంగా విద్యార్థులకు ఫోన్స్.. ఆపై రీఛార్జ్ కూడా...!

చాలామంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఇష్టపడరు.అందుకనే ఎక్కువగా ప్రవేట్ స్కూల్స్ లో పిల్లలను జాయిన్ చేస్తున్నారు.

 Phones For Students There For Free And Then Recharge Too  Smart Phones, Classes,-TeluguStop.com

కానీ, తమిళనాడులో ప్రభత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.దీనికి కారణం లేకపోలేదు ప్రభుత్వం పాఠశాలలపై ఏర్పడుతున్న నమ్మకం ఒకపక్క, అలాగే ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు మరింత పెరుగుతుండడంతో కట్టలేని పరిస్థితులు మరో పక్క.

ఈ కారణాల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

అలాగే కరోనా దృష్ట్యా ఇప్పుడు అందరు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు.

కానీ, చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి సెల్ ఫోన్ లేదు.దీంతో వారికి సాయపడేందుకు ఒక లేడీ టీచర్ ముందుకు వచ్చారు.

ఆవిడ పేరు కె.భార్గవి ఒక లెక్కల టీచర్.ప్రభుత్వ టీవీ చానల్‌ ‘కల్వి తొలైకచి’ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేవాళ్లు.ఈ టీచర్ ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల గురించి మరింత శ్రద్ధ తీసుకుంటుంది.ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా నేరుగా విద్యార్థులతో ముచ్చటించి వారిని గైడ్ చేసేది.కానీ టీచర్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది స్టూడెంట్స్ లేరు.

దీనితో ఆ టీచర్ కి అనుమానం వచ్చింది.అసలు వీళ్లు పాఠాలు వింటున్నారా లేదా అని తెలుసుకోవడానికి టీచరమ్మ 80 కిలోమీటర్లు ప్రయాణించి తన విద్యార్థుల వద్దకు చేరుకుంది.

అక్కడికి వెళ్ళాక గాని తెలియలేదు ఆవిడకు.వారంతా పేద విద్యార్థులని.

ఒక్క పూట గడవడమే కష్టమయ్యే పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలని తెలుసుకుంది.తినడానికి కష్టం గా ఉన్న వాళ్ళు ఇంకా మొబైల్ ఫోన్ ఎలా కొనుకుంటారు అని ఆలోచించింది.

ఎవరో వస్తారు .వీళ్ళ బతుకులను బాగు చేస్తారు అని ఆలోచించకుండా సమస్య తెలుసుకొని టీచరమ్మే సాయం చేయడానికి ముందుకొచ్చింది.తను దాచుకున్న లక్ష రూపాయలతో 16 మంది పేద విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు కొనిచ్చింది.అంతటితో ఆగకుండా వాటికి సిమ్‌ కార్డులు, రీఛార్జ్ బాధ్యతలను కూడా తానే తీసుకుంది.

స్కూళ్లు తిరిగి తెరిచి, విద్యార్ధులు వచ్చేవరకు వాటికి పూర్తి రీఛార్జ్ తానే చేస్తానని హామీ ఇచ్చింది.నా పిల్లలు పాఠాలు వినాలి, పరీక్షలు పాస్ అవ్వాలి.అందుకే నావంతు చిన్న ప్రయత్నం అంటూ వెల్లడించింది.టీచరమ్మ చేసిన ఈ పనికి అందరం జేజేలు కొట్టాలిసిందే కదా మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube